మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ పర్యాటక రంగాభివృద్ధి

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రచారం ఆరంభించింది.హైదరాబాద్ జరూర్ ఆనా అంటూ బాక్సర్ నిఖత్ జరీన్ వీడియో విడుదల చేశారు.;

Update: 2025-05-04 12:58 GMT
శంషాబాద్ విమానాశ్రయంలో మిస్ సౌత్ ఆఫ్రికా జోలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్‌కు సంప్రదాయ స్వాగతం

మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలక తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో దీనిపై తెలంగాణ పర్యాటక శాఖ ప్రచారం చేపట్టింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్, తెలంగాణ రాష్ట్ర డీఎస్పీ నిఖత్ జరీన్ ప్రచార వీడియోను తెలంగాణ పర్యాటక శాఖ ఆదివారం ఎక్స్ వేదికగా విడుదల చేసింది. మిస్ వరల్డ్ 2025 పోటీలు మన హైదరాబాద్ నగరంలో జరగనున్నాయి.




 ఇవీ అందాల పోటీలే కాదు 

ఇవీ అందాల పోటీలే కాదు మన తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, మహిళా సాధికారత, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటుకునే అవకాశం. అందాల సుందరులు,తెలివిగల ముద్దుగుమ్మలు ప్రపంచంలోని 120 దేశాల నుంచి తరలిరానున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే అందాల సుందరీమణులను నిఖత్ జరీన్ అభినందించార.ఈ పోటీలు మర్చిపోలేని విదంగా నిర్వహిద్దామంటూ నిఖత్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక ప్రాభవాన్ని ప్రపంచం ముందు ఆవిష్కరించబోతున్నాం, హైదరాబాద్ జరూర్ ఆనా అంటూ నిఖత్ జరీన్ వీడియోలో కోరారు.




మిస్ దక్షిణాఫ్రికా జోలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్‌ క స్వాగతం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిస్ సౌత్ ఆఫ్రికా జోలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్‌ను ఆదివారం సంప్రదాయ ఆతిథ్యంతో సాదరంగా స్వాగతించింది. జోలైజ్ జాన్సెన్ వాన్ రెన్స్‌బర్గ్‌కు బొట్టు పెట్టి సాదరంగా సంప్రదాయ పద్ధతిలో పూల మాల వేసి స్వాగతం పలికారు.



తెలంగాణ పర్యాటకానికి ప్రోత్సాహం
హైదరాబాద్,జిల్లా పర్యాటక గమ్యస్థానాలను గుర్తించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది.రాష్ట్రవ్యాప్తంగా కీలకమైన పర్యాటక ప్రదేశాల్లో మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నారు.సుందరాంగుల రాకతో తెలంగాణ పర్యాటక ఆకర్షణలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించనుంది.మిస్ వరల్డ్ వేదిక ద్వారా తెలంగాణ దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను పెద్ద సంఖ్యలో ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది.దీనివల్ల పర్యాటక వృద్ధి ఉపాధి అవకాశాలకు ఇంధనమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ టూరిజం హబ్
తెలంగాణ ప్రభుత్వం తన మొట్టమొదటి పర్యాటక విధానాన్ని ఆవిష్కరించింది. తెలంగాణ పర్యాటక రంగంలో రూ.15,000 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. మిస్ వరల్డ్ పోటీని ప్రపంచ వేదికగా ఉపయోగించుకుని, తెలంగాణ యొక్క గొప్ప చారిత్రక, సాంస్కృతిక,ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రపంచానికి ప్రదర్శించాలని ప్రభుత్వం యోచిస్తోంది.120 దేశాల ప్రతినిధులు,150 కి పైగా దేశాలలో ప్రత్యక్ష ప్రసారాలతో, మిస్ వరల్డ్ ఈవెంట్ తెలంగాణ పర్యాటక సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురానుంది. ప్రపంచ పటంలో రాష్ట్రాన్ని మల్టీ డైమెన్షనల్ టూరిజం హబ్ గా ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించింది.2024లో తెలంగాణ 1,55,113 మంది అంతర్జాతీయ పర్యాటకులను స్వాగతించింది. మిస్ వరల్డ్ ద్వారా ఈ సంఖ్యను గణనీయంగా పెంచాలని రాష్ట్రం లక్ష్యంగా పెట్టుకుంది.




Tags:    

Similar News