కోలాహలంగా మిస్ వరల్డ్ ఫ్యాషన్ షో

హైదరాబాద్ లో సాగుతున్న మిస్ వరల్డ్ ఫ్యాషన్ షో కోలాహలంగా సాగింది. మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోలో ప్రపంచ అందాల భామలు తెలంగాణ చేనేత చీరల్లో మెరిశారు.;

Update: 2025-05-24 15:20 GMT
మిస్ వరల్డ్ ఫ్యాషన్ షోలో మెరిసిన ప్రపంచ అందాల భామలు

హైదరాబాద్ నగరంలోని ట్రేడెంట్ హోటల్ లో మిస్ వరల్డ్ ఫ్యాషన్ షో శనివారం రాత్రి కోలాహలంగా జరిగింది. పోచంపల్లి, గద్వాల్ చీరలు ధరించిన ప్రపంచ సుందరీమణులు ర్యాంపుపై మెరిశారు. అందాల భామలకు తెలంగాణ చేనేత వస్త్రాలతో డిజైన్ చేయడం ఆనందంగా, గర్వంగా ఉందని మిస్ వరల్డ్ డిజైనర్ అర్చనా కొచ్చార్ చెప్పారు.




 తెలంగాణ చేనేత వస్త్రాలతో మిస్ ఇండియా పోటీదారుల ఫ్యాషన్ షో ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది. ఎర్రటి మెరిసే గాగ్రా డ్రెస్ ధరించిన మిస్ ఇండియా నందిని గుప్తా ఆకట్టుకున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా అందాల భామలు దుస్తులు ధరించి ర్యాంప్ వాక్ చేశారు.




 మనసు దోచిన ర్యాంప్ వాక్

మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ర్యాంప్ వాక్ ఆహుతుల మనసు దోచింది.ట్రేడెంట్ హోటల్ లో కొనసాగుతున్న మిస్ ఇండియా ఫ్యాషన్ ఫినాలేలో పలువురు ముద్దుగుమ్మలు రంగురంగుల దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు.



 గొల్లభామల చేనేత చీరలు ధరించి సందడి

గొల్ల భామల చేనేత వస్త్రాలతో యూరోప్ అందాల భామలు మెరిశారు. వనితలు గొల్లభామ శారీస్ ధరించి ర్యాంపు పై సందడి చేశారు. యూనిస్కో గుర్తింపు పొందిన గొల్ల బామల చేనేత వస్త్రాలతో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మిస్ వరల్డ్ రాంప్ వాక్ లో అందాల భామలు పాల్గొన్నారు.



 పోచంపల్లి కి అంతర్జాతీయ ఖ్యాతి

మిస్ వరల్డ్ పోటీల్లో ప్రపంచ సుందరీమణులు పోచంపల్లి చేనేత చీరలు ధరించి ర్యాంప్ వాక్ చేయడంతో పోచంపల్లి చీరలకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. హ్యాండ్లూమ్ వస్త్రాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మెరిశారు. అమెరికా కరేబియన్ చేనేత వస్త్రాలతో అందాల భామలు చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది.


Tags:    

Similar News