హైదరాబాద్ కు తరలివచ్చిన ప్రపంచ సుందరీమణులు
72వ మిస్ వరల్డ్ పోటీల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో పలు దేశాలకు చెందిన అందాల భామలు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. 52 దేశాల సుందరాంగుల రాకతో సందడి నెలకొంది.;
హైదరాబాద్ నగరంలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు బుధవారం నాటికి 51 దేశాలకు చెందిన సుందరాంగులు తరలివచ్చారు. ఈ పోటీలను నిర్వహించేందుకు మరో 23 మంది మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థ అదికారులు వచ్చారు. మిస్ ఫిలిఫ్పైన్స్, మిస్ మయన్మార్, మిస్ వియత్నాం, మిస్ అమెరికా, మిస్ అమేనియా, మిస్ ఇథియోఫియా సుందరీమణులు బుధవారం రాజీవ్ గాందీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు తరలివచ్చారు.
ఒక్క రోజే 70 మంది అందాల భామలు
విమానాశ్రయంలో అందాల భామలకు ఘన స్వాగతం
మిస్ వరల్డ్ పోటీలకు కాంప్లిమెంటరీ ఎంట్రీ పాస్‌లు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్ వరల్డ్ ఈవెంట్స్ కోసం ఉచిత ఎంట్రీ పాస్‌లను అధికారిక ఆన్‌లైన్ ఎంపిక ప్రక్రియ ద్వారా పంపిణీ చేస్తామని మిస్ వరల్డ్ నిర్వాహకులు ప్రకటించారు. ఆసక్తిగల వ్యక్తులు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో (https://tourism.telangana.gov.in) నమోదు చేసుకోవాలని కోరారు. కాంప్లిమెంటరీ పాస్ కు ఎంపికైన వారు ఎంట్రీ పాస్‌ను సేకరించడానికి వారి అధికారిక ఈమెయిల్ కు పంపిస్తామని చెప్పారు.