Telangana High Court | ‘ప్రభుత్వ ఆస్తులకు మంత్రే బాధ్యుడు’
ఫార్ములా ఈ-కార్ రేస్ అంశంలో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.;
ఫార్ములా ఈ-కార్ రేస్ అంశంలో కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ విచారణ క్రమంలో ఉన్నతన్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఆస్తులకు సదరు మంత్రి బాధ్యుడిగా ఉండాలని తెలిపింది. అన్ని వేళల్లో కోర్టు తన అధికారాన్ని వినియోగించదని, పోలీసుల దర్యాప్తు అక్రమంగా ఉన్న సందర్భాల్లో మాత్రమే కోర్టు జోక్యం చేసుకుని తన అధికారాన్ని వినియోగిస్తుందని స్పష్టం చేసింది న్యాయస్థానం. ‘‘తెలంగాణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో కేటీఆర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎఫ్ఐఆర్‌లో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. హెచ్ఎండీఏ ఖాతాలోని నగదును నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చయినా ఒప్పందం చేసుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారన్న అభియోగాలున్నాయి. పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్.. హెచ్ఎండీఏ నిధులను దుర్వినియోగం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఒక దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసే అధికారాన్ిన న్యాయస్థానం కొన్ని సందర్భాల్లో మాత్రమే వినియోగింస్తుంది. పోలీసుల దర్యాప్తు అన్యాయంగా ఉన్న సందర్భంగా కోర్టు తన అధికారాన్ని వినియోగించాల్సి ఉంటుంది’’ అని తెలిపింది.
కోర్టు అలా భావించట్లేదు
‘‘పోలీసులకు ఉన్న అధికారాలను హరించివేయాలని కోర్టు భావించడం లేదు. ఏసీబీ చేసిన ఆరోపణ్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని కోరటు అనుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యుడిగా ఉండాలి. ఉత్తమ పరిపాలన అందించే బాధ్యత మంత్రులదే. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుదారు బాధ్యతగల హోదాలు ఉన్నారు. మరో నిందితుడితో కలిసి కేటీఆర్ నిధులను అక్రమంగా వినియోగించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగం జరగలేదని పిటిషనర్ చేస్తున్న వాదనలను కోర్టు నమ్మడం లేదు. దర్యాప్తులో ఈ విషయాలన్నీ తేలాలి. హెచ్ఎండీఏ నిధులు సంబంధిత మంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని ప్రాథమికంగా తేలింది. కాగా అవి దుర్వినియోగం అయ్యాయా? లేదా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. నేరం జరిగిందని చెప్పడానికి ప్రాథమిక ఆరోపణలు మాత్రమే ఎఫ్ఐఆర్‌లో ఉంటాయి. పూర్తిస్థాయి వివరాలన్నీ ఎఫ్ఐఆర్‌లో పొందుపరచాల్సిన అవసరం లేదు’’ అని న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది.
ఎఫ్ఐఆర్‌ను కొట్టేయలేం
‘‘పిటిషనర్ పేర్కొన్నట్లు ఏసీబీ, నేరపూరిత కుట్ర సెక్షన్లు వర్తించకపోయినప్పటికీ ఎఫ్ఐఆర్‌ను కొట్టేయలేం. దర్యాప్తులో భాగంగడా ఇతర సెక్షన్లు కూడా పెట్టే అవకాశం ఉంటుంది. మంత్రి మండలి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పిటిషనర్ హెచ్ఎండీఏ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేరయించారని ఆరోపణలు ఉన్నాయి. సొంత లబ్ధి కోసమా లేక మూడో వ్యక్తికి లబ్ధి కూర్చడానికి ఈ బదిలీ జరిగిందా అనే అంశంపై దర్యాప్తు జరగాల్సి ఉంది. డిసెంబర్ 18న ఫిర్యాదు అందితే 19న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 20న పిటిషనర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం దర్యాప్తులో హైకోర్టు జోక్యం చేసుకోదల్చుకోవడం లేదు’’ అని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. అనంతరం కేటీఆర్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో కేటీఆర్ అరెస్ట్‌కు అన్నీ సిద్ధమయినట్లు ప్రచారం జోరందుకుంది. ఇంతలో కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసుల జారీ చేసింది.