పార్కు స్థలం కబ్జా.. మేయర్ మండిపాటు

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 26లో మున్సిపాలిటీకి చెందిన పార్కు స్థలం కబ్జాకు గురైంది. తాజాగా ఈ అంశంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.;

Update: 2025-01-20 12:01 GMT

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 26లో మున్సిపాలిటీకి చెందిన పార్కు స్థలం కబ్జాకు గురైంది. తాజాగా ఈ అంశంపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మేయర్ కబ్జా అయిన పార్కు స్థలాన్ని డిసి ప్రశాంతి, ఇతర విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో గల పార్కు స్థలంలో బయట ఉన్న జిహెచ్ఎంసి బోర్డు ను ఓ ప్రైవేట్ వ్యక్తి తొలగించి అట్టి బోర్డును ఎవరికీ కనిపించకుండా పెట్టి జిహెచ్ఎంసి పార్కు స్థలంలో పైప్ లైన్ వేసి కూరగాయలు పండించుకుంటున్నట్లు పరిశీలినలో మేయర్ దృష్టికి వచ్చింది. పార్కు పక్క ఫ్లాట్ వ్యక్తి తన సరిహద్దులో పెద్ద ప్రహరీగోడ నిర్మించుకోవడంతో నిచ్చెన వేసుకొని పార్కులోకి దిగి ఖాళీ స్థలంలో కూరగాయలు పండించుకుంటున్నట్లు తెలిసింది. ప్రైవేటు వ్యక్తి పార్కు స్థలాన్ని ఆక్రమించుకొని కూరగాయలు పండించుకుంటున్న నేపథ్యంలో వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులు సర్వే చేసి పార్కు స్థలంలో ఉన్న కాంపౌండ్ వాల్, పార్కులోని కూరగాయల మొక్కలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, జీహెచ్ఎంసీ బోర్డును యథావిధిగా ఏర్పాటు చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు.

అన్యాక్రాంతమైన సుమారు 15 వేల కోట్ల రూపాయల విలువ గల భూమిని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాపాడారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... జిహెచ్ఎంసి పార్కు స్థలాన్ని గాని, ఖాళీ స్థలాలను కబ్జా/ఆక్రమించినా ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. క్రిమినల్ కేసులు పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News