విష్ణు తప్పేమీ లేదు.. అసలు విషయం చెప్పిన నిర్మల మోహన్‌బాబు

మంచు కుటుంబ కథా చిత్రం మరో కీలక మలుపు తీసుకుంది. మనోజ్ తల్లి నిర్మల ఎంట్రీతో ఈ వివాదంలో క్లారిటీ ఇచ్చింది.

Update: 2024-12-17 10:58 GMT

మంచు కుటుంబ కథా చిత్రం మరో కీలక మలుపు తీసుకుంది. మొన్నటి వరకు తీవ్ర వివాదాలతో రోడ్డుకెక్కిన మంచు కుటుంబం రెండు రోజులుగా కాస్త ప్రశాంతంగా ఉంటుంది. కానీ మంచు మంటలు చల్లారాయి అనుకునేలోపు తమపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ మంచు విష్ణుపై మనోజ్ మరో ఫిర్యాదు చేశాడు. తన తల్లి పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నామని, అందుకోసం జెనరేటర్లు తెప్పించామని, కానీ కొందరు మనుషులతో విష్ణు వచ్చి గొడవ చేయడమే కాకుండా జనరేటర్లలో పంచదార, డీజిల్ పోసి తమను చంపడానికి ప్రయత్నించాడని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో మంచు వివాదం మళ్ళీ మొదలుకొచ్చినట్లయింది. అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందని అంతా అయోమయంలో పడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి ఇంటిపోరు తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. ఈ క్రమంలో తెరపైకి వచ్చిన మంచు మనోజ్ తల్లి, మోహన్ బాబు భార్య నిర్మల షాకింగ్ విషయాలు బయటపెట్టారు. అసలు విష్ణు తప్పేమీ లేదని, మనోజ్ చేసిన ఫిర్యాదులో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈ మేరకు అనేక విషయాలను పోలీసులకు ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్లో పేర్కొన్నారు.

ఆమె స్టేట్‌మెంట్ ఆమె మాటల్లోనే..

‘‘నేను అనగా, మంచు నిర్మలా మోహన్ బాబు, W/o. మంచు మోహన్ బాబు, వయసు: 64 సం||లు, నివాసం: జల్పల్లిలోని మంచుటౌన్లో ఉంటున్నాను. డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయిన విష్ణు మంచు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేసాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్ని బయట పెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్టు తెలిసింది. నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు. తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతో ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసాడు. నా చిన్న కొడుకైన మనోజ్కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉన్నది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేయుచున్న వాళ్ళు కూడా 'మేమిక్కడ పని చేయలేమని', వాళ్ళే మానేసారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టిన రోజు సెలబ్రేట్ చేశాడు, విష్ణు గదిలో వున్న తన సామాను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు మీకు తెలియజేయుచున్నాను’’ అని నిర్మల వివరించారు.

Tags:    

Similar News