మహేశ్వర్ రెడ్డి వర్సెస్ శ్రీధర్ బాబు.. అసెంబ్లీలో మాటల యుద్ధం

తెలంగాణ అసెంబ్లీ సమావేశం వాడి వేడిగా సాగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాపం తెలియజేస్తూ నిర్వహించిన సభలో కూడా అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాదనలు కొనసాగాయి.;

Update: 2024-12-30 09:42 GMT

బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం జరిగింది. పీవీ నరసింహా రావుకు భారత రత్న ఇచ్చింది ప్రధాని మోదీనే అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగానే దేశంతా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ మరణంపై సంతాపం తెలియజేస్తుంటే.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాత్రం ఇది పట్టడం లేదని, ఆయన న్యూఇయర్ వేడుకలపై దృష్టి పెట్టారంటూ మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అందుకోసమే రాహుల్.. వియత్నాంకు వెళ్లారని కూడా మహేశ్వర్ అన్నారు. సంతాప సభలో ఆయన కీర్తితో పాటు అవమానాలకు కూడా చెప్తున్న రాహుల్.. నూతన సంవత్సర వేడులకు వెళ్లారా? లేదా? అని ప్రశ్నించారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో ఆయన ఒక ఆర్డినెన్స్ తెస్తే దానిని చింపి ఆయనను అవమానించిన నేత రాహుల్ గాంధీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల తీరు భక్తి శివుడిపైన చిత్తం చెప్పులపైన అన్నట్లు ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మన్మోహన్ సింగ్ మరణ వార్త తెలిసిన గంటల వ్యవధిలోనే ప్రధాని మోదీ అక్కడకు చేరుకున్నారని, ఆయన స్మారక చిహ్నం నిర్మిస్తామని ప్రకటించారని మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి మన్మోహన్ సింగ్‌పైన ఏమాత్రం ప్రేమ ఉంది, గౌరవం ఉంది అనేది ఈ విషయాలు చూస్తేనే అర్థమవుతోందని విమర్శించారు. పీవీ నరసింహరావుకు కాంగ్రెస్ సర్కార్.. ఒక అడుగు స్థలం కూడా కేటాయించలేదని, భారత రత్న కూడా ఇవ్వలేదన్నారు. కానీ మన్మోహన్ సింగ్, పీవీలు ఈ దేశానికి చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని, ప్రజల గుండెల్లో వారిద్దరూ చిరస్మరణీయంగా ఉండిపోతారని అన్నారు. మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సంతాప సభలో రాజకీయ ప్రసంగం ఎందుకని ప్రశ్నించారు. సంతాప సభ నిర్వహిస్తున్నామా? రాజకీయ ప్రసంగాల పోటీలు నిర్వహిస్తున్నామా? ఇక్కడ రాజకీయ ప్రసంగాలు ఎందుకు? అని శ్రీధర్ బాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్ మేరకు బీజేఎల్పీ నేత వ్యాఖ్యలను స్పీకర్ రికార్డుల నుంచి తొలగించారు.

Singh?

Tags:    

Similar News