Mahesh Kumar Goud | ‘ఏ ఒక్కరినీ మర్చిపోము.. అందరికీ పదవులుంటాయి’

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పాటుపడిన ఏ ఒక్కరినీ పార్టీ అధిష్టానం మర్చిపోదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

Update: 2024-11-21 13:04 GMT

టీపీసీసీ సమావేశంలో మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్(Congress) పార్టీ విజయం కోసం పాటుపడిన ఏ ఒక్కరినీ పార్టీ అధిష్టానం మర్చిపోదని టీపీసీసీ(TPCC) చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తెలిపారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం ఆ అంశంపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అద్భుతమైన పాలన కనబరిచామని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చడంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం భేష్ అనిపించుకుందని వివరించారు. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈరోజు టీపీసీసీ సమావేశం జరిగింది. అందులో మాట్లాడుతూ.. ఆయన కాంగ్రెస్ ఏడాది పాలనపై హర్షం వ్యక్తం చేశారు. ఏడాది కాలంలో గత ప్రభుత్వం చేయలేకపోయిన ఎన్నిను పనులను ఈ ప్రభుత్వం చేసి చూపిందని, ప్రభుత్వ పనితీరు చూసి పక్క రాష్ట్రాలు విస్తుబోతున్నాయని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తోందని కొనియాడారు.

టీపీసీసీ సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో అనేక కీలక అంశాలపై మహేష్ కుమార్ చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలు, కుల గణన చర్చించారు. వీటిలో ఉన్న లోటుపాట్లు, వీటిని ఇంకా మెరుగుపరచడానికి ఉన్న మార్గాల గురించి వారు పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చేయాల్సిన ప్రచారం, తీసుకోవాల్సిన చర్యలుపై మహేష్ కుమార్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించింది. దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం,ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు అంతే పది నెలల కాలంలో చేసి చూపించారు’’ అని అన్నారు.

‘‘రూ.18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500 కే గ్యాస్, 50 వేల ఉద్యోగాలు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీస్కెళ్లాలి. అందుకోసం ప్రభుత్వం విజయోత్సవాలు చేపట్టింది. కాంగ్రెస్ కార్యకర్తలు మన ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటికి తీసుకెళ్లాలి. మనం చేపట్టిన కార్యక్రమాలను పూర్తిగా అవగాహన చేసుకొని ప్రజలకు వివరించాలి. ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజిపి లు ప్రభుత్వంపైన విపరీతంగా దుష్ప్రచారం చెస్తుంది. వాటిని తిప్పికొట్టాలి. అందుకు తగ్గట్టు మన ప్రచారం ఉండాలి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనేక మందికి కార్పొరేషన్ల పదవులు వచ్చాయి. డీసీసీ అధ్యక్షులకు అందరికి పదవులు వచ్చాయి. అనుబంధ సంఘాల చైర్మన్ లకు పదవులు వచ్చాయి. ఇంకా చాలా పదవులు ఇవ్వాల్సి ఉంది. పార్టీ కోసం పని చేసిన అందరికి పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలలో పార్టీ అన్ని విధాలుగా గట్టిగా కృషి చేయాలి. మంచి ఫలితాలు రావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’’ అని వివరించారు.

Tags:    

Similar News