కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు లేఖలు...
కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు క్యాబినెట్ సెక్రటరీ నుండి లేఖలు వచ్చాయి. వీరిద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి రాష్ట్రపతి ఆమోదించినట్లు లేఖలో పేర్కొన్నారు.
నరేంద్ర మోదీ దేశప్రధానిగా మూడోసారి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈరోజు రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి తీసుకోనున్న వారితో ఆయన లోక్ కల్యాణ్ మార్గ్ లోని తన నివాసంలో 'టీ మీటింగ్' నిర్వహించారు. ఈ భేటీలో కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి చోటు దక్కించుకున్న ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కూడా హాజరయ్యారు.
కాగా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు క్యాబినెట్ సెక్రటరీ నుండి లేఖలు వచ్చాయి. వీరిద్దరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడానికి రాష్ట్రపతి ఆమోదించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇంకా ఆ లేఖల్లో ఏముందంటే.. "కేంద్ర మంత్రి మండలిలో రాష్ట్ర మంత్రిగా మీ నియామకాన్ని కాబోయే ప్రధానమంత్రి రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ఈ సిఫార్సును రాష్ట్రపతి ఆమోదించారు. ప్రమాణ స్వీకారోత్సవం 9 జూన్ 2024 ఆదివారం రాత్రి 7 గంటలకు షెడ్యూల్ చేయబడింది. రాష్ట్రపతి సమక్షంలో రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం జరగనుంది. వేడుకను సజావుగా నిర్వహించేందుకు వీలుగా, ప్రమాణ స్వీకారోత్సవ సమయానికి ఒక గంట ముందుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని, మంత్రుల కోసం కేటాయించిన ప్రదేశంలో కూర్చోవాలని కోరుతున్నాం" అంటూ క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ఇరువురికీ లేఖలు పంపారు.
స్ట్రీట్స్ నుండి సెంట్రల్ మినిష్టర్ వరకు...
కరీంనగర్ స్ట్రీట్స్ నుండి రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి మండలిలో అవకాశం లభించడంపై బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశం కల్పించిన కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలకు నేను ఎంత కృతజ్ఞతతో ఉన్నానో చెప్పలేను అన్నారు. రాష్ట్రపతికి, మోదీకి, జేపీ నడ్డాకి, రాష్ట్ర, కేంద్ర బీజేపీకి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. నన్ను ప్రోత్సహించి ఈ ఎదుగుదలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ బండి సంజయ్ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.
From streets of Karimnagar to being recommended for appointment as Minister of State in the Council of Ministers - As I write this, I cannot express enough on how grateful I am to people of Karimnagar Parliamentary Constituency, @BJP4India President Shri @JPNadda ji,… pic.twitter.com/neh3meDjey
— Bandi Sanjay Kumar (Modi Ka Parivar) (@bandisanjay_bjp) June 9, 2024
అంకితభావంతో పని చేస్తాను...
కేంద్ర మంత్రి మండలికి తన పేరును సిఫారసు చేసినందుకు కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మీరు నాపై ఉంచిన నమ్మకం, విశ్వాసం... మీ వికసిత్ భారత్ విజన్ పై నా అంకితభావాన్ని మరింత పెంచిందన్నారు కిషన్ రెడ్డి.
Grateful to Hon'ble PM Shri @narendramodi ji for recommending my name to the Hon'ble President for appointment as a Cabinet Minister in the Council of Ministers.Your trust and confidence in me further my dedication towards your vision of Viksit Bharat@rashtrapatibhvn pic.twitter.com/mvsImtMOnm— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) June 9, 2024