మూడేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది.. కేటీఆర్

బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి లగచర్ల మహిళల విరాళం.;

Update: 2025-04-22 14:15 GMT

తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తథ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కరికీ మిత్తితో సహా తిరిగిస్తామని హెచ్చరించారు. అయితే మరోపక్క ఏప్రిల్ 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు ఈ కార్యక్రమానికి తమ తరపు కొంత విరాళం అందించారు. తెలంగాణ భవన్‌లో తమ విరాళాన్ని నేరుగా కేటీఆర్‌కు అందించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీ రజతోత్సవం కోసం లగచర్ల మహిళల విరాళం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. భూసేకరణ వివాదం తలెత్తిన సమయంలో కొందరు పోలీసులు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని, ఈ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌కు వివరించామని కేటీఆర్ చెప్పారు.

‘‘సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి, వారి పాలనలో పోలీసులు తీరును జాతీయ మానవహక్కుల కమిషన్ తీవ్రంగా తప్పుబట్టింది. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక తర్వాత అయినా జరిగిన దానికి సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి. బాధ్యులైన పోలీసులను సర్వీస్ నుంచి తొలగించాలి. లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. హైకోర్టు స్టే ఇచ్చినా భూసేకరణ చేస్తున్నారని తెలిసింది. దానిని వెంటనే ఆపాలి. మూడేళ్లలో మా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అందులో సందేహం అక్కర్లేదు. అతి చేస్తున్న అధికారులపై అప్పుడు కచ్ఛితంగా చర్యలు తీసుకుంటాం’’ అని కేటీఆర్ హెచ్చరించారు.

Tags:    

Similar News