ఫ్లోరిడాలో రోడ్ యాక్సిడెంట్.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

ఈ ప్రమాదానికి సంబంధించిన విషయం తమకు పెద్ద కమార్తె ద్వారా తెలిసిందని మోహన్ రెడ్డి కుటుంబీకులు తెలిపారు;

Update: 2025-03-17 09:46 GMT

అమెరికాలోని ఫ్లోరిడాలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మరణించారు. ఆదివారం పిక్నిక్ కోసం వెళ్లిన కుటుంబీకులు తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి చిన్న కుమార్తె ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హర్వీన్(6), ప్రగతి రెడ్డి అత్త సునీత(56)గా గుర్తించారు ఫ్లోరిడా పోలీసులు. ఈ విషయం తెలియడంతో టేకులపల్లిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన అంశం తమకు పెద్ద కమార్తె ద్వారా తెలిసిందని మోహన్ రెడ్డి కుటుంబీకులు తెలిపారు. ప్రగతి 13ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఆమె మరణంతో తమ కుటుంబంతో పాటు, ఆమె భర్త కుటుంబం శోకసంద్రంలో మునికి పోయిందని కుటుంబీలకు రోధిస్తున్నారు. తాము అమెరికాకు వెళ్లడానికి సిద్ధమవుతున్నామని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ప్రగతి కుటుంబీకులు తెలిపారు. ఈ ప్రమాదంపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మృతుల కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

‘‘అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా టేకులపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ పవిత్రాదేవిల రెండో కుమార్తె ప్రగతిరెడ్డి, ఆమె కుమారుడు అర్విన్, ప్రగతి రెడ్డి అత్త సునీత లు మృతిచెందడం ఎంతో బాధాకరం. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో ఆ భగవంతుడు వారికి ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అలాగే, గాయపడిన రోహిత్ రెడ్డి, ఆయన చిన్న కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని కేటీఆర్ తన ఎక్స్(ట్విట్టర్) పోస్ట్‌లో పేర్కొన్నారు.

Tags:    

Similar News