‘కోటి దీపోత్సవం మన ఐకమత్యానికి నిదర్శనం’
హైదరాబాద్‌లో ఎన్‌టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోటి దీపోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో ఎన్‌టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న కోటి దీపోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన రాష్ట్రపతికి కోటి దీపోత్సవం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఆమెతో పాటు తెలంగాణ గవర్నర్ జష్ణుదేవ్ వర్మ కూడా పాల్గొన్నారు. భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రౌపది ముర్ము.. కోటి దీపోత్సవంలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆమె కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మన సాంప్రదాయలను అనుసరిస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తిలకించడం అమితానందాన్ని కలిగిస్తుందని చెప్పారు.
‘‘కార్తీక మాసంలో అందరూ శివుడిని కొలుస్తారు. అసత్యంపై సత్యం విజయం సాగించిన పండగ ఇది. తెలుగు నేలపై కార్తీక మాసం వేళ కోటి దీపోత్సవం చ ేయడం ఎంతో ఆనందంగా ఉంది. అందరూ ఒక్కటై దీపాలు వెలిగించడం మన ఐకమత్యాన్ని, మనోలోని ఏకత్వాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా యాదాద్రి శ్రీ లక్ష్మనరసింహస్వామి కళ్యాణం, పూరి జగన్నాథుని పూజలో పాల్గొనడం నా అదృష్టం’’ అని ఆమె పేర్కొన్నారు.