తెలంగాణకు బీర్లు బంద్

తెలంగాణకు కింగ్ ఫిషర్ సంస్థ భారీ షాకిచ్చింది. తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్‌కు బీర్ల సరఫరాను నిలిపివేసింది.;

Update: 2025-01-08 11:08 GMT

తెలంగాణకు కింగ్ ఫిషర్ సంస్థ భారీ షాకిచ్చింది. తెలంగాణ బీవరేజెస్ కార్పొరేషన్‌కు బీర్ల సరఫరాను నిలిపివేసింది. ఈ విషయాన్ని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ ప్రకటించింది. హెనికిన్, కింగ్ ఫిషర్ బీర్లను యూబీ సంస్థ సరఫరా చేస్తుంది. తెలంగాణ నుంచి రూ.900 కోట్ల బకాయిలు ఉండటంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని యూబీ వెల్లడించింది. 2019 నుంచి ధరలను సవరించకపోవడంతో యూబీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సెబీకి లేఖ ద్వారా వెల్లడించింది. నాలుగేళ్లుగా ఎంత ప్రయత్నించినప్పటికీ దాని ఉత్పత్తులకు అందించే బేస్ ధరల్లో పెరుగుదల లేదని, ఇది నష్టాలకు దారి తీసిందని, తెలంగాణలో తమ కార్యకలాపాలు అసమర్థంగా మారడంతోనే తెలంగాణకు తమ బీర్ల సరఫరాను నిలిపివేయాలని నిశ్చయించుకున్నట్లు యూబీ తన ప్రకటనలో తెలిపింది.

తెలంగాణలో మంచి ఫేమ్ ఉన్న కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, అల్ట్రా, లైట్, అల్ట్రామ్యాక్స్ తో పాటు కొన్ని ఇతర బ్రాండ్లను కూడా తయారు చేస్తుంది. తెలంగాణ జరిగే మొత్తం బీర్ల విక్రయాల్లో కింగ్‌ఫిషర్ బ్రాండ్లవే 60-70శాతం ఉంటాయని పరిశ్రమ వర్గాలు చెప్తు8న్నారు. తెలంగాన ప్రభుత్వం వినియోగదారులకు బీర్ ధరలను పెంచింది కానీ దాని తయారీకి కావాల్సిన బేస్‌ల ధరలు మాత్రం పెంచలేదని, అది పిచ్‌ను గందరగోళానికి గురి చేసింది. టీజీబీసీఎల్ నుంచి చెల్లింపుల్లు కూడా సమయానికి జరగడం లేదని, తీవ్ర జాప్యం చేస్తూ సంస్థను నష్టాల్లోకి నెట్టిందని తెలిపింది. ప్రతి ఏడాది రాష్ట్ర ఖజానాకు రూ.4500 కోట్లకు పైగా ఈ సంస్థ నుంచి ఆదాయం చేకూరుతుందని తెలిపారు.

‘‘మా వాటాదారులందరికీ విశ్వసనీయ బాధ్యత ఉంది. ప్రతి బీర్ నష్టానికి విక్రయించడంతో మా కార్యకలాపాలను కొనసాగించడం భారంగా మారింది. అదనంగా టీజీబీసీఎల్‌కి చేసిన సరఫరాల కోసం అధికమొత్తంలో చెల్లించిరావాల్సి రావడం కష్టంగామారింది. అందుకే తెలంగాణకు బీర్ల సరఫరాను నిలిపివేస్తుంది’’అని ప్రకటన తెలిపింది. కాగా ఈ బీర్ల సరఫరా అంశాన్ని తక్షణమే పరిష్కరించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు డీ వెంకటేశ్వర్‌రావు ప్రభుత్వాన్ని కోరారు.

Tags:    

Similar News