చీల్చి చెండాడటానికి ఫిక్సైన కేసీఆర్

కేసీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ మొత్తం గ్యాస్, ట్రాష్ అన్నారు కేసీఆర్.

By :  Vanaja
Update: 2024-07-25 09:50 GMT

బడ్జెట్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతం అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశానికి కేసీఆర్ హాజరయ్యారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ పై విమర్శలు గుప్పించారు. ఈ బడ్జెట్ మొత్తం గ్యాస్, ట్రాష్ అన్నారు కేసీఆర్.

కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలని మేము పెద్దగా ప్రశ్నించలేదు.. కానీ ఈ 6 నెలల్లో ప్రభుత్వం, రాష్టానికి సంబంధించి ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ చేయలేదన్నారు. మహిళలకు ఇస్తానన్న రుణాలు ఎప్పటి నుండో ఉన్న పథకమే.. వీళ్లు ఇప్పుడు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారన్నారు. ఈ బడ్జెట్‌పై భవిష్యత్తులో ప్రభుత్వాన్ని చీల్చి చెండడుతామని హెచ్చరించారు.

మేము వ్యవసాయ స్థిరీకరణ కోసం రెండు పంటలకు రైతుబంధు ఇస్తే వీళ్ల అవగాహనలేమి వల్ల దానిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని కేసీఆర్ మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పాలసీ ఏమి లేదు, దాని గురించి స్టోరీ టెల్లింగ్‌లా ఉంది తప్ప బడ్జెట్‌లా ఏదీ లేదు. వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, పేద వర్గాల మీద పాలసీ అనేది ఏమిటి అని ఏ ఒక్క అంశం లేదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

భట్టి బడ్జెట్ ప్రసంగం రాజకీయ ప్రసంగంలా ఉంది. ఒత్తిపలకడం తప్ప భట్టి కొత్తగా చెప్పిందేమీ లేదని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు జల్లింది అన్నారాయన. "రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు చెప్పారు. ప్రజల గొంతు కోసింది ప్రభుత్వం. దళితబంధు పథకం ప్రస్తావనే లేదు. దళితులంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా? గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారు.ఒత్తిపలకడం తప్ప భట్టి కొత్తగా చెప్పిందేమీ లేదు. రైతులను పొగిడినట్టే పొగిడి నిండా ముంచారు. బడ్జెట్ ఒట్టి డొల్ల. ఈ అర్బక ప్రభుత్వం ఒక్క పాలసీ ఫార్ములేషన్ కూడా చేయలేదు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. రైతులను ప్రభుత్వం వంచించింది. కథ చెప్పారు తప్ప.. బడ్జెట్ పెట్టినట్టు అనిపించలేదు. బడ్జెట్‌లో ఒక పద్దు.. పద్ధతి లేదు. రాష్ట్రంలో విద్యుత్ సరిగా లేదు. యాదవులు, మత్స్యకారులను ప్రభుత్వం పట్టించుకోలేదు" అని కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Tags:    

Similar News