కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత వేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హై కోర్టులో సోమవారం విచారణ జరిగింది.

By :  Vanaja
Update: 2024-05-27 11:21 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం కవిత వేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హై కోర్టులో సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పిటిషన్లపై విచారణ చేపట్టింది. కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్ధంగా కవితను అరెస్ట్ చేశారని ఆయన వాదించారు. మహిళలను విచారించే విషయంలో స్పష్టత కోసం సీఆర్‌పీసీలోని అంశాలను లేవనెత్తుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశామన్నారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతుండగానే ఈడీ, సీబీఐ సమన్లు పంపమని కోర్టుకు తెలిపారు.

ఇక ఇదే అంశాన్ని సుప్రీం కోర్టులో ప్రస్తావించగా.. తదుపరి విచారణ వరకు సమన్లు ఇవ్వబోమని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ప్రకటన చేశారని తెలిపారు. కానీ మార్చి 15 న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో సోదాలు నిర్వహించి... అదే రోజు సాయంత్రం ఆమెను అరెస్టు చేశారని విక్రమ్ చౌదరి న్యాయస్థానానికి వివరించారు. ఒక పార్టీలో ముఖ్య నాయకురాలు అయ్యుండి, ఎమ్మెల్సీగా ఉన్న కవితపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టి అరెస్టు చేశారని న్యాయవాది కోర్టుకి తెలిపారు. మహిళల హక్కులను కాలరాసే విధంగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయని ఆరోపించారు. కేసులో అన్ని వివరాలను పరిశీలించి బెయిల్‌ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు.

అయితే, దీనిపై తమ వాదనలు వినిపించేందుకు ఈడీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా తరఫు న్యాయవాది గడువు కావాలని కోరారు. మంగళవారం తగిన డాక్యుమెంట్లతో కోర్టుకు ఫిజికల్ గా హాజరై వాదనలు వినిపిస్తామని చెప్పారు. ఈడీ అభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News