JP NADDA | సీఎం రేవంత్‌పై జేపీ నడ్డా విమర్శల వర్షం

సీఎం రేవంత్‌పై జేపీ నడ్డా విమర్శల వర్షం కురిపించారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ సభలో జేపీ నడ్డా మాట్లాడారు.

Update: 2024-12-07 14:58 GMT

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ హామీలతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఆటోడ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామన్నారని, ఇచ్చారా అని నడ్డా ప్రజలను ప్రశ్నించారు. సీఎం రేవంత్ మాయల ఫకీరులా డ్రామాలు ఆడుతున్నాడని ఆయన ఆరోపించారు. రైతు భరోసా ఇవ్వలేదని, రైతు కూలీలకు ఇస్తామన్న రూ.12వేలు ఎటు పోయాయని ఆయన ప్రశ్నించారు.

- విద్యాభరోసా, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఏమయ్యాయని ఆయన అడిగారు. కల్యాణలక్ష్మీ తులం బంగారం ఎక్కడ ఇచ్చారని నడ్డా ప్రశ్నించారు. షాదీ ముబారక్ పథకం కింద లక్షరూపాయలు అందాయా? అని జేపీ నడ్డా ప్రశ్నించారు.బీసీ, రైతు వ్యతిరేక సర్కారు వైఖరిని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి సర్కారును వచ్చే ఎన్నికల్లో సాగనంపాలని కోరారు.తెలంగాణ అభివృద్ధి చెందాలంటే బీజేపీ సర్కారు రావాలి అని జేపీ నడ్డా ఆకాంక్షించారు.
- ఒక పక్క ఏడాది కాంగ్రెస్ ప్రజా పాలనపై అధికార పార్టీ విజయోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగసభ నిర్వహించారు.


Tags:    

Similar News