‘లుచ్ఛాలకే లుచ్ఛా కేటీఆర్’.. మండిపడ్డ జగ్గారెడ్డి

బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శలు వర్షం కురిపించారు. బీఆర్ఎస్ అనేది సోషల్ మీడియా దండుపాలెం బ్యాచ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-26 10:08 GMT

బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి విమర్శలు వర్షం కురిపించారు. బీఆర్ఎస్ అనేది సోషల్ మీడియా దండుపాలెం బ్యాచ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం పోవడంతో హరీష్ రావు, కేటీఆర్‌కు పిచ్చెక్కిందని, వారిని ఏదైనా మెంటల్ ఆసుపత్రిలో చూపించాలంటూ చురకలంటించారు. అందుకే కాంగ్రెస్ అధికారంలో ఉండే ఈ నాలుగు సంవత్సరాలు ఎప్పుడెప్పుడు అయిపోతాయా అని వేయి కళ్లతో బీఆర్ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. అందులో భాగంగానే కాంగ్రెస్‌ని, సీఎం రేవంత్ రెడ్డిని ఎప్పుడెప్పుడు బద్నాం చేద్దామా అని ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అనని మాటలను కూడా అన్నట్లే కట్టుకథలు అల్లుతున్నారని, అలా చేస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారాయన. బీఆర్ఎస్‌కు ప్రజలకు ఇంకో గుణపాఠం కూడా నేర్పించే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు.

కొపమొచ్చింది.. తిట్టా..

‘‘మేము అనని మాటలు అన్నామంటే కోపం రాదా? చేవకూఫ్ చేష్టలు చేయొద్దని ముందుగానే హెచ్చరిస్తున్నా. నాకు కోపం వచ్చింది.. అందుకే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను తిట్టాను. అధికారం పోవడంతో వాళ్లు పాగాల్ గాళ్లయ్యారు. కొందరు అమెరికాలో ఉండి కేటీఆర్ ఫొటోలు పెట్టి మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఇది ఏమాత్రం పద్దతి కాదని కేటీఆర్‌కు సూచిస్తున్నా. ఇకనైనా బుద్దెరిగి ప్రవర్తించాలి. లేకపోతే ఇంకా ఘాటు బదులు వస్తుంది. మీకు మేము సమాధానం ఇవ్వాల్సిన పనిలేదు. మా కార్యకర్తలు చాలు’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మాతో కుస్తీ మీ వల్ల కాదు

‘‘నాతో, రేవంత్ రెడ్డితో కుస్తీ చేసే ధమ్ము మీకులేదు. మాతో కొట్లాడే శక్తి కూడా లేదు. కేటీఆర్, హరీష్ రావుకు రాజకీయం ఎలా చేయాలో తెలియదా? నేను కలెక్టర్‌ను తిట్టినట్లు పోస్ట్‌లు పెట్టారు. పోయిన ప్రభుత్వంలో కొందరు కలెక్టర్లు నేను పదిసార్లు ఫోన్లు చేసిన ఎత్తలేదు, రెస్పాన్స్ లేదు. అందుకే తిట్టినా. ఇప్పుడు ఓ మహిళా కలెక్టర్‌ను తిట్టానని ప్రచారం చేస్తున్నారు. వాడి ఫొటో బయటపెడుతున్నా.. కానీ ఎవరు వాడిని కొట్టకండి. పట్టుకురండి. అదే విధంగా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అమ్మా అన్నా సరే.. నీయమ్మా అన్నారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఉన్నది రాసుకోండి. ఎడిట్‌లు చేసి కావాల్సినట్లు మార్చుకుని పోస్ట్‌లు పెడితే ఏమాత్రం మంచిగా ఉండదు. ఈ చెత్త సాంప్రదాయం తెచ్చిందే బీఆర్ఎస్ కొడుకులు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.

మేము మీలా చేతకానోళ్లం కాదు..

‘‘నేను, రేవంత్ రెడ్డి ఫైటర్లం. మీలా ఆంధ్రోళ్ల పేర్లతో తిట్టం. రేవంత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి, తన మార్క్ పని మొదలు పెట్టి పది నెలలే అయింది. ఈ పది నెలలకే బీఆర్ఎస్ తట్టుకోలేకపోతున్నారు. ఇంకా నాలుగేళ్లు భరించాల్సిందే. అంతేకాకుండా ఈ టర్మ్ కాకుండా మరో 5ఏళ్లు కూడా అధికారంలో ఉండాలని ప్లాన్ చేస్తున్నాం. కేటీఆర్ నీకు కొంచెం గౌరవం ఇస్తా.. కానీ నీ సోషల్ మీడియాలో కాస్త కంట్రోల్‌లో పెట్టి. లేదంటే మా సంగతి మీకు తెలియదు. కాంగ్రెస్ వాళ్లను కేటీఆర్ లుచ్చాలు అంటున్నారు. కేటీఆర్ ఏమైనా తక్కువ తిన్నాడా.. ఆయన లుచ్ఛాలకే లుచ్ఛా. రేవంత్ మీరంటున్నట్లు చిట్టినాయుడు కాదు గట్టినాయుడు. రేవంత్ తొడ కొడితే కేటీఆర్‌కి కాళ్లు వణుకుతాయి. ధైర్యం చేయడంలో రేవంత్, జగ్గారెడ్డితో కేటీఆర్, హరీష్ రావులు పోటీ పడలేరు. మీ బావబామ్మర్దులు చిన్నపిల్లల చేష్టలు మానుకోవాలి. తప్పుడు రాతలు రాయిస్తే.. ఖైరతాబాద్ సెంటర్‌లో ముక్కు నేలకు రాయిస్తాం. నావి, రేవంత్‌వి మాటలు మోటుగా ఉన్నా మేము మంచోళ్ళం’’ అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News