Allu Arjun | రేవంత్‌పై అల్లు అర్జున్ నిరసనా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటన విచారణకు నల్లు దుస్తులు ధరించి హాజరయ్యారు. ఇది సీఎంపై నిరసనకు సంకేతమా..;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటన విచారణకు హాజరయ్యారు. చిక్కడపల్లి ఇచ్చిన నోటీసుల ప్రకారం మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. విచారణకు హాజరై తాను చట్టాన్ని గౌరవించే పౌరుడిని అని చెప్పిన మాటలను నిజం చేశాడు బన్నీ. అయితే పోలీస్ స్టేషన్‌కు అల్లు అర్జున్ వచ్చి తీరుతో తీవ్ర చర్చ రాజుకుంది. పోలీసులు విచారణకు అల్లు అర్జున్.. పూర్తి బ్లాక్ డ్రస్ ధరించి, బ్లాక్ కారులో చేరుకున్నారు. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పాడు. కానీ టోటల్ బ్లాక్ అండ్ బ్లాక్‌తో రావడంతో.. అల్లు అర్జున్.. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. తన నిరసనకు గుర్తుగానే బన్నీ బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చాడని, అందులో సందేహం లేదని ఒక వర్గం వారు గట్టిగా నమ్ముతున్నారు. మరికొందరు మాత్రం బన్నీ ఫేవరేట్ కలర్ బ్లాక్ అని, అందుకే ఆ డ్రెస్‌లో వచ్చాడని ఈ చర్చలను కొట్టిపారేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ వ్యవహారంపై అల్లు అర్జున్ వర్సెస్ స్టేట్ గవర్న్‌మెంట్ అన్న తరహాలో పరిస్థితులు ఉన్నక్రమంలో సదరు హీరో బ్లాక్ డ్రెస్ వేసుకుని రావడం కీలకంగా మారింది. ఈ క్రమంలోనే బ్లాక్ డ్రెస్ అంటే నిరసనకు గుర్తు కాదని కొందరు వాదిస్తున్నారు.
సాధారణంగా అసెంబ్లీ సహా పలు ఇతర అంశాల విషయంలో కూడా వ్యతిరేకతను వ్యక్తం చేసేవారు తమ నిరసనకు చిహ్నం నల్లు దుస్తులు, నల్ల బ్యాడ్స్‌లు, నల్ల జెండాలు, నల్ల రెబ్బన్లు ధరించి వస్తారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సమయంలో కూడా లగచర్ల రైతుల అరెస్ట్‌పై నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా నల్ల దుస్తులు ధరించి, చేతులకు బేడీలు వేసుకుని ఇచ్చారు. ఈ క్రమంలోనే తనపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈరోజు విచారణకు నటుడు అల్లు అర్జున్ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చాడా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. పోలీసుల విచారణకు టోటల్ బ్లాక్ డ్రెస్‌తో బన్నీ ఒక్కడే వచ్చాడు. గతంలో ఎవరూ ఇలా రాలేదు. దీంతో ఇది పక్కా నిరసనకు సంకేతమే అన్న చర్చకు బలం చేకూరుతుంది.
ఇది వరకు డ్రగ్స్ సహా మరెన్నో ఇతర కేసుల్లో పోలీసుల విచారణకు హాజరైన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా సినీ ఇండస్ట్రీకి చెందిన వారందరూ కూడా ఫుడ్ వైట్ డ్రెస్‌లో వచ్చే వారు. తాము ఏ తప్పు చేయలేదన్న విషయానికి తమ డ్రెస్ చిహ్నంగా నిలుస్తుందని కొందరు కొన్ని సందర్భాల్లో చెప్పి ఉన్నారు. అటువంటి ఈరోజు అల్లు అర్జున్ మాత్రం బ్లాక్ డ్రెస్‌తో పాటు బ్లాక్ కారు వేసుకుని పోలీసుల విచారణకు హాజరయ్యారు. దీంతో రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ అనే అగ్గి మరింత రాజుకుంటుందన్న వాదన గట్టిగానే వినిపిస్తోంది. ప్రతి పక్షాల నుంచి ఎనలేని మద్దతు అందుతుండటంతోనే సీఎంకు నిరసనగా అల్లు అర్జున్ బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చారని సమాచారం.
ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సూచనల మేరకే అల్లు అర్జున్ నడుచుకుంటున్నారని, అసెంబ్లీలో రేవంత్ వ్యాఖ్యల తర్వాత ప్రెస్‌మీట్ పెట్టడానికి కారణం కూడా కేటీఆరే నన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు నల్ల దుస్తులతో పోలీస్ స్టేషన్‌కు రావాలన్న ఐడియా కూడా కేటీఆరే ఇచ్చుంటారని, తనపై అసెంబ్లీ వేదికగా అసత్య ప్రచారాలు చేసిన సీఎంపై నిరసన వ్యక్తం చేయాలని కేటీఆర్ చెప్పడంతోనే బన్నీ ఈ డెసిషన్ తీసుకున్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది. కానీ అటువంటిదేమీ లేదని బన్నీ టీమ్ వారి నుంచి వాదన వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై చర్చ మాత్రం కార్చిచ్చులా అంతకంతా పెరుగుతోంది. మరి దీనిపై బన్నీ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.