Indian poultry industry| పౌల్ట్రీ రంగంలో ఏఐ సాంకేతికత

హైదరాబాద్ లో పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సును మంగళవారం ప్రారంభించారు.పౌల్ట్రీ ఇండియా సదస్సు పరిశోధనలు,టెక్నాలజీ మార్గదర్శకాలను అందించే గొప్ప వేదికగా మారింది.

Update: 2024-11-26 13:06 GMT

హైదరాబాద్ హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సును రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచీ ఘోష్ మంగళవారం ప్రారంభించారు. దేశంలోని పౌల్ట్రీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ఉత్సవమని, ఇది దేశ, విదేశీ ఉత్పత్తిదారులు పౌల్ట్రీ పరికర తయారీదారులను ఒక్క వేదిక మీదకు తీసుకువచ్చిందని సబ్యసాచీ చెప్పారు.

- ఈ వేడుకలలో 40 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. పౌల్ట్రీ రంగం దేశ జీడీపీలో 1శాతం అందిస్తూ, కీలకమైన రంగంగా మారిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పౌల్ట్రీ రంగానికి ప్రాముఖ్యత ఉందని అన్నారు.
- పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్తమ పద్ధతులను అవలంబించుకోవడం, నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతలను స్వీకరించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవచ్చన్నారు. ఖర్చులను తగ్గించుకోవడం అవసరం అని కార్యదర్శి తన ప్రసంగంలో పేర్కొన్నారు.పౌల్ట్రీ ఇండియా 2024 సదస్సు ఈ పరిశ్రమలో, పరిశోధనలు, టెక్నాలజీ మార్గదర్శకాలను అందించే గొప్ప వేదికగా మారిందన్నారు.


Tags:    

Similar News