Mohan Babu | ‘నాకు ప్రాణ హాని ఉంది’.. మనోజ్‌పై మోహన్‌బాబు ఫిర్యాదు..

తన రెండో కుమారుడు మంచు మనోజ్‌తో గొడవపై మోహన్‌బాబు పోలీసులను ఆశ్రయించారు. తనకు హాని కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Update: 2024-12-09 16:22 GMT

తన రెండో కుమారుడు మంచు మనోజ్‌(Manoj Manchu)తో గొడవపై మోహన్‌బాబు(Mohan Babu) పోలీసుల(Police)ను ఆశ్రయించారు. తనకు హాని కలిగే అవకాశం ఉందని, తనకు రక్షణ కల్పించాలంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు. అందులో తన కుమారుడు, నటుడు మనోజ్, అతడి భార్య మౌనికపై చర్చలు తీసుకోవాలని కోరారు. తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు హాని కల్పించే ఆలోచనలో తన రెండో కుమారుడు, అతని అనుచరులు ఉన్నారని, ఈ క్రమంలో అసాంఘిక శక్తులుగా మారిన కొందరి నుంచి తనకు రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో మోహన్ బాబు కోరారు.

‘‘నేను జల్‌పల్లిలో పదేళ్లుగా నివసిస్తున్నా. నాలుగు నెలల క్రితం నా రెండో కుమారుడు ఇల్లు వదిలి వెళ్లాడు. తాజాగా మనోజ్ కొందరు సంఘ వ్యతిరేక శక్తులతో కలిసి నా ఇంటి దగ్గర ఉద్రిక్తత సృష్టించాడు. మనోజ్ తన 7 నెలల కుమార్తెను ఇంటి పని మనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్2లోని నా కార్యాలయంలోకి 30 మంది చొరబది సిబ్బందిని బెదిరించారు. మనోజ్, మౌనికక నా ఇంటిని అక్రమంగా ఆక్రమించుకొని ఉద్యోగులను బెదిరిస్తున్నారు. నా భద్రత, విలువైన వస్తువులు, ఆస్తుల విషయం భయంగా ఉంది. వాళ్లు నాకు హాని కలిగించే ఉద్దేశంతో ఉన్నారు. నా నివాసాన్ని శాశ్వతంగా ఖాళీ చేయాలని బెదిరించారు. సంఘ విద్రోహులుగా మారి నా ఇంట్లో ఉన్న వారికి ప్రాణహాని కలిగిస్తున్నారు. చట్టవిరుద్ధంగా నా ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి కుట్రలు పన్నుతున్నారు. నేను 70ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్‌ని. మనోజ్, మౌనిక, అతడి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నా భద్రత కోసం అదనపు సిబ్బందిని కేటాయించండి. నా ఇంట్లో ఎలాంటి భయం లేకుండా గడపడానికి రక్షణ కల్పించండి’’ అని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా తాజాగా ఈ అంశంపై సూపర్ స్టార్ రజనీ కాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మోహన్ బాబు కుటుంబీకులకు ఫోన్ చేసిన ఈ వివాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.

Tags:    

Similar News