తెరుచుకున్న జంట జలాశయాల గేట్లు

ఎగువన వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో జంట జ‌లాశయాల రిజ‌ర్వాయ‌ర్ల‌కు వ‌ర‌ద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది.

By :  Vanaja
Update: 2024-09-07 11:59 GMT

హైదరాబాద్ జంట జలాశయాల అన్ని గేట్లు తెరుచుకున్నాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు జ‌ల‌మండ‌లి అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు. ఎగువన వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో జంట జ‌లాశయాల రిజ‌ర్వాయ‌ర్ల‌కు వ‌ర‌ద నీరు ఇన్‌ఫ్లో పెరిగింది. రెండూ పూర్తి ట్యాంక్ స్థాయికి (FTL) చేరుకుంటున్నాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా జ‌ల‌మండ‌లి ఇవాళ‌ సాయంత్రం ఉస్మాన్ సాగ‌ర్ రెండు గేట్ల‌ను ఒక ఫీటు పైకి, హిమాయ‌త్‌సాగ‌ర్ ఒక గేట్ ఒక ఫీటు పైకి ఎత్తి నీటిని దిగువ‌న ఉన్న‌ మూసీ న‌దిలోకి వదులుతున్నారు.

ఉస్మాన్ సాగర్ రెండు గేట్ల ఒక్కో అడుగు మేర ఎత్తితే 226 క్యూసెక్కుల ఔట్ ఫ్లో.. హిమాయత్ సాగర్ ఒక అడుగు ఎత్తుతో ఒక గేటు ఎత్తితే 340 క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. జలాశయాల‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో... జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి సంబంధించిన అధికారులు, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల‌ ప‌రిపాల‌నా యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కు 1400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా.. ఉస్మాన్ సాగర్ కు 1800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది.

1. హిమాయ‌త్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం - 1763.50 అడుగులు

ప్ర‌స్తుత నీటి స్థాయి - 1761.10 అడుగులు

రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం - 2.970 టీఎంసీ లు

ప్ర‌స్తుత సామ‌ర్థ్యం - 2.455 టీఎంసీ లు

2. ఉస్మాన్ సాగ‌ర్ పూర్తి స్థాయి నీటి మ‌ట్టం - 1790.00 అడుగులు

ప్ర‌స్తుత నీటి స్థాయి - 1787.95 అడుగులు

రిజ‌ర్వాయ‌ర్ పూర్తి సామ‌ర్థ్యం - 3.90 టీఎంసీ లు

ప్ర‌స్తుత సామ‌ర్థ్యం - 3.430 టీఎంసీ లు

Tags:    

Similar News