హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం.. సీవీ ఆనంద్ ఏమన్నారంటే..

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. భారీ మొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-10-25 08:22 GMT

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. భారీ మొత్తంలో డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హుమాయుంగార్‌లో స్థానిక పోలీసులతో కలిసి హెచ్ న్యూ అధికారులు సోదాలు నిర్వమించారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. డ్రగ్స్‌తో పాటు మాదక ద్రవ్య వ్యాపారులను ముగ్గురిని, ఒక విదేశీ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. ఏదో ఒక మార్గాన మాదకద్రవ్యాలు నగరంలోకి చేరుతున్నాయని, యువతకు మత్తులోకి దించి వారి జీవితాలను నాశనం చేస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తీసుకుంటున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అన్న రకాలుగా డ్రగ్స్‌ను కట్టడి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్‌పై పోలీసుల పోరు కొనసాగుతోందని, నెల రోజుల్లో నార్కొటిక్ పనితీరుపై సమీక్ష నిర్వహించి సదరు శాఖను బలోపేతం చేశామని వివరించారు.

సీపీ సీవీ ఆనంద్ ఇంకా ఏమన్నారంటే..

‘‘డ్రగ్స్ ముఠాలను అదుపు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. సింథటిక్ డ్రగ్స్ బెంగళూరు గోవా నుండి సరఫరా అవుతాయి. న్యాచురల్ డ్రగ్స్ ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపి నుండి సరఫరా అవుతున్నాయి. బెంగళూర్ పై ముందుగా దృష్టి పెట్టాం. ఇందులో రెండు ముఠాలను HNEW పట్టుకుంది. వీళ్ళు అందరూ కూడా ఆఫ్రికా దేశానికి చెందినవారు. మొదటి గ్యాంగ్‌లో సుడాన్ దేశస్థులు ఇద్దరు ఉన్నారు. అబ్దుల్ రెహమాన్ నగరంలో కీలకంగా ఉంటు లోకల్‌గా డ్రగ్స్ డెలివరి బాయ్ లాగా వ్యవహరిస్తున్నాడు’’ అని వివరించారు.

‘‘అతడు 2014 లో హైదరాబాదు కు స్టూడెంట్ వీసా పై వచ్చాడు. అప్పటి నుండి నగరానికి వస్తూ పోతూ ఉన్నాడు. గత రెండు సవత్సరాలు క్రితం నగరానికి వచ్చి టోలిచౌకీ లో ఉంటున్నాడు. వీసా గడువు ముగిసినా టోలిచౌకిలో ఉంటున్నాడు. బెంగళూర్ నుండి ఖుర్భా అనే సప్లయర్ డ్రగ్స్ ఆర్డర్ తీసుకుంటాడు. అతని పై ఇంకా హోల్ సేల్ సప్లయర్స్ ఉన్నారు.. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తాం’’ అని వెల్లడించారు.

‘‘రొమేనియా టాంజానియా కేరళ నైసీరియాకు చెందిన మెయిన్ సప్లయర్ లో ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా బెంగళూరులో కుర్బా డ్రగ్స్ ఆర్డర్లు స్వీకరిస్తాడు. కుర్బా, హానిన్ అని అనే వ్యక్తికి డెలివరీ చేయాల్సిన అడ్రస్ చరవేస్తాడు. హనిన్ ఇచ్చిన అడ్రస్కు రెహమాన్ వల్లి డ్రగ్స్ సరఫరా చేస్తాడు. ఒకరికొకరు కలుసుకోకుండా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. ఖుర్బాకు నెర చరిత్ర ఉంది. రెహమాన్ ఆపిల్ ఫోన్ సీజ్ చేసాం..అందులో చాలా వివరాలు ఉన్నాయి. వినియోగదారుల వివరాలు కూడా వచ్చాయి. వారిని త్వరలో అదుపులోకి తీసుకుంటాం. వారి వద్ద నుండి సమాచారం సేకరిస్తాం. అవసరం అయితే అరెస్ట్ చేస్తాం’’ అని తెలిపారు.

‘‘రెండవ కేసులో కూడా బెంగళూరుకు సంబంధాలు ఉన్నాయి. ఇమ్రాన్ అనే వ్యక్తి బంజారాహిల్స్ ఉంటాడు. మత్తు పదార్థాలకు చిన్నప్పటి నుండి అలవాటు పడ్డాడు. ఫిబ్రవరిలో యాష్ ఆయిల్ సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. జైలుకు వెళ్లి ఇటీవల తిరిగి వచ్చాడు. ఎండిఎంఏ డ్రగ్స్ సప్లై చేస్తూ పుట్టుబడ్డాడు. ఇమ్రాన్ బెంగళూరుకు వెళ్లి ఓ నైజీరియాన్‌తో డ్రగ్స్ సేకరిస్తాడు. డెడ్ డ్రాప్ ద్వారా నందకుమర్ అనే వ్యక్తి నుండి డ్రిక్స్ సేకరిస్తారు. నంద కుమార్ ను కూడా అరెస్ట్ చేశాం. నైజీరియన్ తోపాటు నవీన్ అనే కేరళకు చెందిన వ్యక్తి నుండి కూడా ఇమ్రాన్ డ్రగ్స్ సేకరిస్తాడు. బెంగళూరులో ఉన్న నైజీరియన్‌ను అరెస్టు చేస్తాం’’ అని చెప్పారు.

‘‘క్యాష్ ఆన్ డెలివరి డెడ్ డ్రాప్ ద్వారా పేమెంట్ తీసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తారు. వినియోగదారుల వివరాలు ఉన్నాయి.. వారిని కూడా అదుపులో తీసుకుంటాం. వారి ద్వారా మిగతా కన్జ్యూమర్లను వివరాలు కూడా సెకరిస్తం. నిందితులు డెడ్ డ్రాప్ అండ్ కాంటాక్ట్ లెస్ పద్ధతి ద్వారా డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. సోషల్ మీడియా స్నాప్ చాట్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ ఆర్డర్స్ ఏ పద్ధతిలో తీసుకున్న మేము గుర్తిస్తాం. మ్యూల్ అకౌంట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నట్టు గుర్తించాం. మెయిన్ సప్లయర్లు అందరూ ఫేక్ ఐడెంటీలతో బెంగళూరులో ఉంటున్నారు.

ఒడిశాలో హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్న ప్రాంతాన్ని గుర్తించాం. ఏపీ పోలీసుల సహకారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తాం. పట్టుపడ్డ వారిలో సంపన్నుల కుమారులు కూడా ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News