‘పెరుగుతున్న ట్రేడింగ్ మోసాలు’

డిజిటల్ ట్రేడింగ్ పేరుతో పెరుగుతున్న మోసాలకు చెక్ పెట్టినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.;

Update: 2025-01-29 09:36 GMT

డిజిటల్ ట్రేడింగ్ పేరుతో పెరుగుతున్న మోసాలకు చెక్ పెట్టినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. తాజాగా ఈ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. బ్యాంకు మేనేజర్ సహా మొత్తం 52 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. తాజాగా ఈ ముఠాకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నిందితుల నుంచి భారీగా చెక్‌బుక్‌లు, సెల్‌ఫోన్లు, రబ్బర్ స్టాంపులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ముఠా మూడు రకాల సైబర్ క్రైమ్‌లకు పాల్పడినట్లు వివరించారు. నిందితుల్లో ముగ్గురు బ్యాంకు ఉద్యోగుల ఉన్నట్లు చెప్పారు. ఫేస్‌బుక్ బ్రౌజింగ్, వాట్సప్ గ్రూప్స్ ద్వారా అమాయక ప్రజలను ఆకర్షిస్తున్నారని, భారీగా లాభాలు పొందొచ్చని నమ్మించిన చివరికి వారి నెత్తిన కుచ్చుటోపీ పెడుతున్నారని అన్నారు.

‘‘బాధితుడు దొరికిన వెంటనే ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు వీరు రూ.93 లక్షలు కాజేశారు. మ్యూల్ ఖాతాను తెరిపించి బ్యాంకు అధికారుల సహకారంతో మోసాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించాం. పరజలెవరూ కూడా గుర్తుతెలియని యాప్స్, వాట్సప్ గ్రూప్స్‌లో జాయిన్ కావొద్దు. ఆన్‌లైన్ పెట్టుబడులపై జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. చదువుకున్న వ్యక్తులు సైతం సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోతున్నారు. గతేడాదిలో రూ.3500 కోట్ల విలువైన సైబర్ క్రైమ్స్ జరిగాయి. ఇందులో కేవలం 13శాతం మాత్రమే రికవరీ అయ్యాయి. ఈ కేసుల్లో నగదును రికవరీ చేయడం చాలా కష్టం. నిందితులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వ్యక్తులు కావడంతో దర్యాప్తు కూడా ఆలస్యమవుతుంది’’ అని సీవీ ఆనంద్ వివరించారు.

Tags:    

Similar News