అభివృద్ధిలో హైదరాబాద్ అగ్రస్థానం, సీఎం ఎం చెప్పారంటే...

దేశంలోనే అభివృద్ధిలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.హైదరాబాద్ ప్రగతిపై నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

Update: 2024-11-20 14:10 GMT

దేశంతోనే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిందని నైట్ ఫ్రాంక్ రిపోర్టు వెల్లడించింది. రియల్ ఎస్టేట్, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాల్లో హైదరాబాద్ ముందుందని నైట్ ఫ్రాంక్ ఇండియా ఫ్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ఐటీ, టెక్నాలజీ రంగాల్లో హైదరాబాద్ కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.జూబ్లీహిల్స్, నియోపోలిస్, రాయదుర్గం, కోకాపేట, బాచుపల్లి ప్రాంతాల్లో లగ్జరీ విల్లాలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్ నగర శివార్లలో భూముల ధరలు సైతం పెరిగాయి.


హైదరాబాద్ ను అగ్రస్థానంలో నిలుపుతాం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ను అన్ని రంగాలలో గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు తాము అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.నైట్ ఫ్రాంక్ నివేదిక తాము చేస్తున్న ప్రయత్నాలకు ఆమోదం లభించినట్లయిందని సీఎం తెలిపారు.‘‘మనమందరం కలసి హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా మార్చగలం’’అని సీఎం తెలిపారు. ఈ శుభవార్తను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడంలో ప్రతి ఒక్క హైదరాబాదీ ప్రయత్నించాలని సీఎం కోరారు.

పరిశ్రమల స్థాపనతోనే ఉద్యోగావకాశాలు
“రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువతకు ఉపాధి ఉద్యోగావకాశాలు లభించాలంటే పరిశ్రమలు స్థాపించాలి. అవసరమైన చోట భూ సేకరణ జరగాల్సిందే. అయితే, భూమి రైతుల ఆత్మగౌరవంతో ముడివడి ఉంటుంది. భూ సేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వలేని పరిస్థితి ఉన్నందున, భూ సేకరణ చేసే ప్రాంతాల్లో భూముల విలువ మూడింతలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఎక్స్ పోస్టులో తెలిపారు. ‘‘భూ సేకరణలో భూములు కోల్పోయే రైతుల బాధలను ప్రజా ప్రభుత్వం అర్థం చేసుకోగలదు. శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియలో త్యాగం చేస్తున్న భూ యజమాన కుటుంబాలను ఆదుకోవడానికి నష్టపరిహారం పెంచాలి. అప్పుడే రైతులు ముందుకొస్తారు. అందుకే నష్టపరిహారానికి సంబంధించిన చట్టాన్ని సవరించాలని ఆదేశాలిచ్చాం’’అని సీఎం పేర్కొన్నారు.

లగచర్ల గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొడంగల్ నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో బుధవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, వ్యవసాయ కమిటీ ఛైర్మన్ కోదండ రెడ్డి, ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ తదితరులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు.



Tags:    

Similar News