హైదరాబాద్‌లో అందాల భామలకు అద్భుత ఆతిథ్యం
72వ మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చిన వివిధ దేశాల అందాలభామలకు తెలంగాణ పర్యాటక శాఖ అధికారులు సంప్రదాయ స్వాగతం పలుకుతున్నారు.;
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన అందాల భామలకు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి బొట్టు పెట్టి, మెడలో పూల దండ వేసి అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.
అనంతరం వారిని డప్పు చప్పుళ్లతో ముందుకు సాగుతున్న కళాకారులు...నలుగురు యువతులు నృత్యం చేస్తూ ముందుకు సాగుతుండగా పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన వ్యాన్ వరకు తోడ్కొని తీసుకువచ్చారు.
అయిదు నక్షత్రాల హోటల్ లో అద్భుత ఆతిథ్యం
పెరిగిన విదేశీ భామల రాక
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అగాథే లౌ కౌట్, మిస్. ఫ్రాన్స్‌ను గ్రాండ్ ట్రెడిషనల్ స్వాగతంతో హృదయపూర్వకంగా స్వాగతించారు.ఐరీన్ గాసా సెర్రా,క్వాన్నాలియానా రతనఫోల్ పీటర్స్, అనా ప్లీజ్ పిక్వెరాస్ డి ఆల్బా,సుసానా టీక్సీరా ఫెర్రాజ్ లకు గ్రాండ్ ట్రెడిషనల్ వెల్‌కమ్ చెప్పారు.
మిస్ వరల్డ్ కంటెస్ట్ నిర్వహణ బాధ్యులైన క్లారా లసీ కేట్ (Miss. Clara Lucy Kate) ఎమ్మా లూయిస్ గ్రే (Miss.Emma Louise Gray) కూడా హైదరాబాద్ చేరుకున్నారు. మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా మంగళవారం సాయంత్రం ట్రైడెంట్ హోటల్ లో మిస్ వరల్డ్ నిర్వాహకులు, తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు కలిసి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.