పట్నంకు ప్రత్యేక బ్యారక్.. ఆదేశాలిచ్చిన హైకోర్టు..

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

Update: 2024-11-19 09:25 GMT

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇన్ని రోజులు ఐదుగురు ఖైదీలతో కలిసి బ్యారక్‌ను షేర్ చేసుకున్న పట్నం.. తనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈరోజు విచారణ చేపట్టిన హైకోర్టు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరుకు చర్లపల్లి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆయనకు ఇంటి భోజనాన్ని కూడా అనుమతించాలని ఆదేశాలిచ్చింది న్యాయస్థానం. లగచర్లలో కలెక్టర్‌పై దాడి జరిగిన కేసులో పట్నం నరేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇందులో భాగంగా ఆయనను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడ ఐదుగురు ఖైదీలతో కలిసి ఆయన బ్యారక్‌ను షేర్ చేసుకుంటున్నారు. కాగా ఇటీవల తనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేయగా ఈరోజు విచారణ జరిపింది న్యాయస్థానం. అంతేకాకుండా తన రిమాండ్‌ను రద్దు చేయాలని కూడా పట్నం నరేందర్.. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పట్నం నరేందర్ రెడ్డి. కాగా ఈ పిటిషన్‌పై విచారణకు కోర్టు గతంలో నిరాకరించింది.

అసలేం జరిగిందంటే..

వికారాబాద్ జిల్లా దుద్యాల మండటం లగచర్ల, పోలేపల్లిలో 1350 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫార్మా సిటీ కోసం భూసేకరణపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడం కోసం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా పలువురు ఇతర అధికారులు లగచర్ల, పోలేపల్లికి చేరుకున్నారు. కాగా అక్కడ వారికి తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురైంది. అధికారులక వ్యతిరేకంగా గ్రామస్తులు, రైతులు నినాదాలు చేశారు. అంతేకాకుండా అధికారులపై కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో అధికారులకు చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా కలెక్టర్‌పై దాడి చేసేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తి బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ ప్రధాన అనుచరుడు సురేష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ దాడి జరగడానికి ముందే పట్నం నరేందర్, సురేష్ పదుల సంఖ్యలో ఫోన్‌లో మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పట్నం నరేందర్ కూడా సురేష్‌తో మాట్లాడారు. ఈ సందర్బంగానే కేటీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు విచారణలో వెలల్లడైంది. ఈ విషయాన్ని స్పష్టం చేయడం కోసం డీజీపీ ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. సురేష్‌పై ఇప్పటికే అత్యాచారం సహా పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో సురేష్‌పై ఉన్న కేసులను తొలగించడం కోసం పట్నం రేందర్ కీలకంగా వ్యవహరించారిన కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు.. పట్నం రేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags:    

Similar News