హైడ్రాకు అదనపు బలం.. ఎన్ని పోస్ట్‌లంటే..

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల భరతం పట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అస్త్రమే హైడ్రా.

Update: 2024-09-25 14:09 GMT

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల భరతం పట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అస్త్రమే హైడ్రా. ఎక్కడిక్కడ ఆక్రమణలను గుర్తిస్తూ వాటిపై కఠిన చర్యలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది. జిల్లా అంతటా చిన్నా పెద్ద తేదా లేకుండా అన్ని ఆక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. ప్రస్తుతం అమీన్‌పూర్ పెద్ద చెరువు ఆక్రమణలపై ఫోకస్ పెట్టింది హైడ్రా. ఇప్పటికే అక్కడి పరిసరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అక్కడి అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధిక సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో హైడ్రా యాక్షన్ చేపట్టింది. ఇదిలా ఉంటే హైదరాబాద్ అంతటా అక్రమ నిర్మాణాలను కట్టడి చేస్తున్న హైడ్రాలో సరికొత్త పోస్ట్‌లు భర్తీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే 169 కొత్త పోస్ట్‌ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 169 పోస్ట్‌ల భర్తీ కోసం జీఓ నెంబర్ 99ని విడుదల చేసింది. ‘‘మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ చెప్పిన పరిస్థితుల దృష్ట్యా 169 పదవుల నియామకం అనుమతించబడింది. పలు కేటగిరీల్లో వీటి నియామకం జరగనుంది. ఈ పదవుల నియామకాన్ని హైడ్రా కమిషనర్ పర్యవేక్షణలో జరగనున్నాయి’’ అని జీవో పేర్కొంది.





 


Tags:    

Similar News