తెలంగాణలో తగ్గిన ఆదాయం, ఆదాయ పెంపుపై సర్కారు దృష్టి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 2024-25 వ ఆర్థిక సంవత్సరం అర్ద భాగంలో వచ్చిన ఆదాయం తగ్గింది.కాంగ్రెస్ సర్కారు అమలు చేస్లున్న పథకాల అమలుకు నిధుల అవసరం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం గణనీయంగా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు తొలి అర్దభాగంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.42,034 కోట్లు ఆదాయ లక్ష్యం కాగా, ఇందులో రూ.4,719 కోట్ల మేర తగ్గిందని తెలంగాణ ఆర్థికశాఖ గణాంకాలు చెబుతున్నాయి. మద్యంపై రూ.8,079 కోట్ల ఆదాయ లక్ష్యం కాగా తొలి అర్దభాగంలో కేవలం రూ.31 కోట్లు మాత్రమే పెరిగింది.మద్యం అమ్మకాల వల్ల రాష్ట్రానికి రూ.8,110 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. జీఎస్టీ, పెట్రోలియంపై అమ్మకపు పన్ను, వృత్తి పన్నుల ఆదాయం లక్ష్యం కంటే తగ్గింది.
కాంగ్రెస్ అసమర్థ పాలనలో భారీగా పడిపోయిన తెలంగాణ ఆదాయం..
— BRS Party (@BRSparty) November 16, 2024
పదకొండు నెలల్లో తెలంగాణకు నష్టం — పదకొండు వేల కోట్లు!
పాలన చేతగాక, వ్యక్తిగత కక్షలతో తెలంగాణను అధోగతి పాలు చేస్తున్న గుంపు మేస్త్రి. pic.twitter.com/O8S1lR7Z6p