జీహెచ్ఎంసీ అధికారాలు ఇక హైడ్రాకు, సర్కారు జీఓ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారాలను ‘హైడ్రా’కు బదలాయిస్తూ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2024-10-16 13:34 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసిన ఉత్తర్వులతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) మరింత బలోపేతం అయింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ,విపత్తు నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ చట్టం 1955 ప్రకారం జీహెచ్ఎంసీకి ఉన్న అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ జీఓఎంఎస్ నంబరు 191 ను బుధవారం విడుదల చేసింది.

- గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అతి పెద్ద నగరాల్లో ఒకటి. దేశంలోనే జీహెచ్ఎంసీ విస్తీర్ణం 650 కిలోమీటర్లలో ఉంది. ఈ మహా నగరంలో పార్కులు, చెరువులు, ప్రభుత్వ స్థలాలు, క్రీడా మైదానాలు ఎన్నో ఉన్నాయి. పెరిగిన పట్టణీకరణతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారింది.

ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత
ఆక్రమణల నుంచి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడం ద్వారా భవిష్యత్తులో ఆయా స్థలాలు సమాజ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు. దీంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను సమర్ధంగా పరిరక్షించేందుకు జీహెచ్ఎంసీ బాధ్యతను హైడ్రాకు బదలాయించారు.

విపత్తు నిర్వహణ బాధ్యత కూడా...
హైడ్రాకు ప్రభుత్వ ఆస్తుల రక్షణతోపాటు విపత్తు నిర్వహణ, విపత్తు ఉపశమన బాధ్యతను అప్పగించారు. గ్రేటర్ లో సెక్షన్ 374 బి కింద ఉన్న అధికారాలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం హైడ్రా కమిషనరుకు బదలాయించారు. నగరంలోని రోడ్లు, డ్రెయిన్లు, పబ్లిక్ వీధులు, నీటి వనరులు, ప్రజా ఆస్తులను రక్షించే అధికారం హైడ్రాకు అప్పగించారు.ఈ జీఓ ద్వారా జీహెచ్ఎంసీ, ప్రభుత్వ బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ పార్కులు ఆక్రమణలు జరగకుండా హైడ్రా పరిరక్షించనుంది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిషోర్ ఈ జీఓను జారీ చేశారు.


Tags:    

Similar News