ఫార్ములా ఈ కారు రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం కేసు నమోదు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణభవన్ కు తరలివచ్చారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పాటు పోలీసులు కూడా రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
- మరో వైపు లగచర్ల కేసులో అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిలుపై విడుదలైన నేపథ్యంలో కార్యకర్తలు ఆయన్ను చేతులతో పైకెత్తి తెలంగాణ భవన్ లోకి తీసుకువచ్చారు. లగచర్ల రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి వీరోచిత పోరాటం చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు.
- పట్నం నరేందర్ రెడ్డి బెయిలు సందర్భంగా కొడంగల్ రైతులు సాధించిన విజయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తాను ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయమిస్తే తాను వివరణ ఇస్తానని కేటీఆర్ చెప్పారు.
- ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ సూచించారు. ప్రభుత్వానికి ఈ రేస్ పై చర్చించేందుకు దమ్ము లేదని అన్నారు. అసెంబ్లీలో చర్చకు పెట్టాలని తాన స్పీకరును అడిగామన్నారు.
గతంలో ఈఫార్ములా రేస్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయని కేటీఆర్ వివరించారు.గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్పపుడు గోపన్ పల్లిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించేందుకు గతంలోనే ప్రయత్నాలు జరిగాయన్నారు.దీనికోసం భూమి సేకరణకు ప్రయత్నాలు చేశారని చెప్పారు.గోపన్ పల్లిలో రేవంత్ రెడ్డికి భూములున్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని లీకులు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ కు పేరు తీసుకువచ్చేందుకు ఫార్ములా ఈ కార్ రేసింగ్ తీసుకువచ్చామని కేటీఆర్ వివరించారు. 2022వ సంవత్సరంలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. ఈ రేస్ కు ఎందరో ప్రముఖులు కూడా వచ్చారని కేటీఆర్ చెప్పారు.
కేసులకు భయపడను : కేటీఆర్
ఉద్యమ నాయకుడి బిడ్డలం, కేసులకు భయపడను, ఏసీబీ వారికి , కోర్టులో కూడా ఈ కాగితాలు ఇస్తామని కేటీఆర్ చెప్పారు. రేవంత్ సర్కారుకు కేటీఆర్ సవాలు విసిరారు. తాము అమృత్ కుంభకోణం సీఎం రేవంత్ రెడ్డి, సోదరుల వ్యవహారాన్ని బయటపెట్టామని తమపై కేసులు పెట్టారని కేటీఆర్ చెప్పారు. తాము ఇచ్చిన డబ్బులు ఈ కార్ రేసింగ్ వద్ద ఉందన్నారు. తాము కేసులకు భయపడేద లేదని, దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. రాజకీయ కేసు కాబట్టి దాన్ని రాజకీయంగా ఎదుర్కొంటామని కేటీఆర్ చెప్పారు. కరెప్షనే లేక పోతే యాంటీ కరప్షన్ ఎక్కడ అని కేటీఆర్ ప్రశ్నించారు. మేం ఇచ్చిన డబ్బులు ముట్టాయని వారు చెప్పారన,అప్పుడు అవినీతి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసు రద్దు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డిపైనే కేసు పెట్టాలని కేటీఆర్ చెప్పారు. ఫార్ములా వన్ కార్ రేసింగ్ లో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఒప్పందాలను కేటీఆర్ మీడియాకు విడుదల చేశారు.తను ఏ తప్పూ చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. కరెప్షన్ లేనపుడు యాంటీ కరప్షన్ ఎక్కడ అని కేటీఆర్ ప్రశ్నించారు. దీని కథ చాలా ఉందని అన్నారు. రేవంత్ ఓఆర్ఆర్ టోల్ టెండరును రద్దు చేయమనండి అని కేటీఆర్ సవాలు విసిరారు.
రాజకీయంగా ఎదుర్కోలేకే కేసులు : కల్వకుంట్ల కవిత
రాజకీయంగా తమను ఎదుర్కోలేక బీఆర్‌ఎస్, కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని న్యాయపరమైన ఎత్తుగడలు వేయాలని తహతహలాడుతున్న కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ డ్రామాను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. తప్పుడు,పనికిమాలిన కేసులు పెడుతున్నారని ఆమె చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి గారూ దయచేసి తెలుసుకోండి,మేము కేసీఆర్ గారికి సైనికులం.తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టింది.మీ చిన్నపాటి వ్యూహాలు మమ్మల్ని భయపెట్టవు; అవి మన సంకల్పాన్ని మాత్రమే బలపరుస్తాయి.పోరాడతాం, తెలంగాణ స్ఫూర్తి గెలుస్తుంది.జై తెలంగాణ! జై జై తెలంగాణ!’’అంటూ కవిత ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
సమాధానం చెబుతానంటే వణుకు ఎందుకు?
‘‘ఫార్ములా ఈ రేస్ పై కేటీఆర్ చర్చిద్దామంటే ఎందుకు మీకా వణుకు?నాలుగు కోట్ల మందికి సమాధానం చెప్తానంటున్నాడు’’ అని బొల్లం మల్లయ్య యాదవ్ ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఈ పోస్టును కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ‘‘మీలాగా దొంగ చాటుగా నక్కి నక్కి హోటల్లో అదానీ కాళ్లు మొక్కి అడ్డంగా బ్యాగులతో దొరికిబాత్రూంలలో దాక్కొని వాషింగ్ మెషిన్ రాజకీయాలు చేస్తూ అందరూ ఉండరు కదా’’అని మల్లయ్య యాదవ్ ఎక్స్ లో పోస్టు చేశారు.