తెలంగాణలో 504 మందిని కాపాడిన రెస్కూ బృందాలు
తెలంగాణలో రెండు జిల్లాలు అతి భారీవర్షాలతో అతలాకుతలం అయ్యాయి.;
తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో బుధవారం రికార్డు స్థాయిలో అతి భారీవర్షాలు కురుస్తుండటంతో వరదలు వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న 504 మంది బాధితులను ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్టుమెంట్ అధికారులు కాపాడారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం కల్యాణ్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఉన్న అన్నాసాగర్ గ్రామం వద్ద 9 మంది వరదల్లో చిక్కుకుపోగా స్టేట్ డిజాసర్టర్ మేనేజ్ మెంట్ సిబ్బంది వారిని కాపాడి సురక్షిత స్థలానికి తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్స్ మొహమ్మద్ నగర్ మండలం గున్ కుల్ గ్రామం వద్ద వరదల్లో చిక్కుకుపోయి అయిదుగురిని బాన్స్ వాడ ఫైర్ సిబ్బంది కాపాడారు. కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ వద్ద వరదప్రాంతాల్లో చిక్కుకున్న 50 మందిని కామారెడ్డి ఫైర్ స్టేషన్ సిబ్బంది రక్షించారు.
మెదక్ జిల్లాలో...
ట్యాంకరుపైకి ఎక్కిన కార్మికులు