‘ప్రజల కోసం పాదయాత్ర చేస్తా’.. ప్రకటించిన కేటీఆర్

బీఆర్ఎస్ అజెండా ప్రజల పక్షాన కొట్లాడటం అయితే.. కాంగ్రెస్ అజెండా అవినీతే అంటూ కేటీఆర్ తూర్పారబట్టారు. పాదయాత్ర చేయడానికి గల కారణాలను తెలిపారు. అవేంటంటే..

Update: 2024-11-01 08:30 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన భవిష్యత్ కార్యాచారణపై కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. పాదయాత్ర తప్పకుండా చేస్తానని, కానీ ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేనని ఆయన వెల్లడించారు. అతి త్వరలో తన పాదయాత్రపై అప్‌డేట్ ఇస్తానని వివరించారు.

‘‘పార్టీ కార్యకర్తలు, నేతలు అందరూ కోరుతున్నట్లుగానే అతి త్వరలో పాదయాత్ర చేస్తాను. రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకుంటా. వారి సమస్య పరిష్కారం కోసం గళమెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటుంది. అధికారం ఉన్నా లేకున్నా మా స్టాన్స్ అనేది మారదని స్పష్టం చేస్తా’’ అని వెల్లడించారు కేటీఆర్.

దీపావళిరోజు ఎక్స్(ట్విట్టర్) వేదికగా నెటిజన్లతో జరిగిన సంభాషణ ఆస్క్ కేటీఆర్‌లో ఈ మేరకు పలు విషయాలను వివరించారు కేటీఆర్ ఈ నేపథ్యంలోనే పార్టీలను బలోపేతం చేయడం కోసం ఆయా పార్టీల అధ్యక్షులు, ఆ పార్టీలోని కీలక నేతలు పాదయాత్రలు చేస్తున్నారు.. మరి పాదయాత్రలపై మీ ఆలోచన ఏంటి? మీరు పాద యాత్ర ఎప్పుడు చేస్తారు? అన్న ప్రశ్నలకు సమాధానంగా అతి త్వరలోనే తన పాదయాత్ర కచ్ఛితంగా ఉంటుందని కేటీఆర్ తేల్చి చెప్పారు. అనంతరం తమ పార్టీ ప్రస్తుతం లక్ష్యంతో పాటు తమపై చేస్తున్న బురదజల్లుడు కార్యక్రమాలను విమర్శించారు కేటీఆర్.

బీఆర్ఎస్ ప్రస్తుత భాధ్యత అదే

ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడం పైన ప్రధానంగా దృష్టి సారించామని తెలిపారు కేటీఆర్. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు తీసుకున్న నిర్ణయాలలో పారదర్శకత పైనా ప్రజల తరఫున కొట్లాడుతామని వెల్లడించారు. పది నెలల పాలనలోనే కాంగ్రెస్‌పై తీవ్ర ప్రజావ్యతిరేకత వస్తున్న క్రమంలో రాజ్యాంగబద్దంగా కాంగ్రెస్ పార్టీని మార్చే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు కేటీఆర్ బదులిస్తే.. మిగిలిన నాలుగేళ్లు కూడా భరించాల్సిందే అని వ్యంగంగా చెప్పారు.

అయితే ప్రజలు ఐదు సంవత్సరాల కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి అయిదు సంవత్సరాలు పూర్తికాలిక పదవిలో ఉంటారా లేదా ఓటుకు నోటు వలన బీజేపీకి వెళ్తాడా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాజకీయాల్లో ఏదైనా జరుగుతుందని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే ఎప్పుడూ ఎలాంటి పరిణామైనా జరగవచ్చు అన్నారు.

రాజకీయాల్లోకి కుటుంబాలను లాగడం నీచం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో ఏనాడు ఇతరుల కుటుంబ సభ్యులను రాజకీయ అంశాల్లోకి లాగలేదన్నారు. దాదాపు రెండు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులను అవహేళన చేసి మాట్లాడినప్పుడు, రాజకీయాలు వదిలేయాలన్నంత భావోద్వేగానికి గురైన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. కేవలం రాజకీయాల కోసం ఇతరుల కుటుంబ సభ్యులను ఎందుకు లాగుతారో అర్ధంకాదని, ఈ విషయం తనకు అత్యంత బాధ కలిగిస్తుందన్నారు.

నీచమైన రాజకీయాల కోసం తన కుటుంబాన్ని లాగుతున్న ముఖ్యమంత్రి పైన, ఆయన వందిమాగదుల పైన ప్రజల మద్దతుతో పోరాటం చేస్తాను. రెేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వతా ఈ నీచమైన రాజకీయ సంస్కృతి అత్యంత హీనమైన దశలో రాష్ట్రం ఉన్నది . అయితే ఈ నీచమైన దశకూడా త్వరలో ముగిసిపోతుందన్న నమ్మకం వ్యక్తం చేశారు

కాంగ్రెస్ అసైలన అజెండా అవినీతే

చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం పేపర్ మీద గొప్పలు చెబుతున్నప్పటికీ అసలైన ఎజెండా అవినీతి మాత్రమే. మూసి బ్యూటిఫికేషన్ కి మేము వ్యతిరేకం కాదు కానీ మూసి లూటిఫీకేషన్ కి వ్యతిరేకం. మూసీ ప్రక్షాళణ దేశంలోనే అతిపెద్ది అవినీతి స్కాం అవుతుందన్నారు. హైడ్రా కేవలం కొందరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుంది ఇప్పటిదాకా ఒక్క పెద్ద బిల్డర్ ని కూడా హైడ్రా ముట్టుకోలేదు, కేవలం పేదలను మధ్యతరగతి ప్రజలను మాత్రమే నిర్దయగా దోచుకున్నదన్నారు .మూసీ నది ప్రక్షాళన అనేది దేశంలోనే అతిపెద్ద అవినీతి స్కామ్ గా నిలవబోతున్నది అన్నారు.

మా సోషల్ మీడీయా వారియర్లకు సలామ్

ఎన్నికల్లో ఓటమి తర్వాత సామాజిక మాధ్యమాల్లో పార్టీ మద్దతుదారులు ప్రపంచవ్యాప్తంగా బాగా యాక్టివ్ గా మారారన్నారు. ఈ అంశంలో పార్టీని మరింతగా బలోపేతం చేసేందుకు అనేక అంశాలను చర్చించాము. పార్టీ తరఫున ఏం ఆశించకుండానే అద్భుతంగా పనిచేస్తున్నారని, వారి మద్దతును పార్టీకీ సోషల్ మీడియా వారియర్లు అందిస్తున్నారన్నారు.

ఇంత బలమైన సోషల్ మీడియా బృందాన్ని కలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.త్వరలోనే ఒక విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా, కాంగ్రెస్కి మద్దతుగా వ్యవహరిస్తున్న ప్రధాన స్రవంతి మీడియాకి ప్రత్యామ్నాయం సోషల్ మీడియా మాత్రమే అన్నారు.

Tags:    

Similar News