Republic Day | ‘రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత’

భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా జరుపుతోంది.;

Update: 2025-01-26 07:18 GMT

భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ వేడుకలను ప్రభుత్వం అట్టహాసంగా జరుపుతోంది. ఈ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్బంగా గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిదని అన్నారు. ‘‘తెలంగాణలో ఇప్పటి వరకు 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ప్రజాప్రభుత్వం కర్షకులకు రైతు భరోసా అందిస్తోంది. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నాం. సన్నరకం బియ్యానికి బోనస్ అందించాం. 2024 వర్షాకాలంలో 1.59కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేయడం జరిగింది. ఉచిత బస్సు రవాణాతో మహిళలకు రూ.4,500 కోట్లు ఆదాయం కలిగింది. 50లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నాం. యువత సాధికారత కోసం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశాం. ప్రజాప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తోంది’’ అని ఆయన తెలిపారు.

 

పెండింగ్ కేసులు పెద్ద సవాలే: సేజే

ఇదిలా ఉంటే తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో సీజే జస్టిస్ సుజయ్ పాల్ నేతృత్వంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుజయ్ పాల్.. జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరిడిపై ఎంతలా ఉందో అదే విధంగా రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత కూడా ఉందని అన్నారు. కోరటులో పెండింగ్‌లో ఉన్న కేసును న్యాయమూర్తులకు ఛాలెంజ్‌ల వంటివన్నారు. న్యాయవాదుల సహకారంతో వాటిని పరిష్కరించే విధంగా అడుగులు వేస్తున్నామన్నారు. గతేడాది జనవరిలో పెండింగ్ కేసులు 2.31లక్షలుగా ఉంటే.. వాటిని 2.29 లక్షలకు తగ్గించామని ఆయన వెల్లడించారు.

‘‘లోక్ అదాలత్ కేసుల పరిష్కారంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాం. హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాం. 10 జిల్లా కోర్టుల్లో డిజిటలైజేషన్ చేశాం. ఇటీవల హైకోర్టు, జిల్లా, తాలూకా కోర్టుల్లో కక్షిదారుల సౌకర్యార్థం మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశాం. హైకోర్టులో ఉచిత వైఫై ఏర్పాటు చేశాం. హైకోరటు నూతన భవనానికి నిధులు కేటాయించారు. అధునాతన సౌకర్యాలతో ఈ భవనం ఉంటుంది. కీలక కేసుల వాదనలు, ప్రఖ్యాతిగాంచిన లాయర్లను యువ న్యాయవాదులు ఆదర్శంగా తీసుకోవాలి’’ అని సుజయ్ పాల్ చెప్పారు.

Tags:    

Similar News