కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు ఈడీ సమన్లు

మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నాయకుడు అజారుద్దీన్ కు ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది.హెచ్‌సీఏలో రూ.20కోట్ల అక్రమాలు జరిగాయని సమన్లలో పేర్కొంది.

Update: 2024-10-03 09:21 GMT

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మాజీ క్రికెటర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ముహ్మద్ అజారుద్దీన్ కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సమన్లు పంపించింది.

- హెచ్ సీఏలో రూ.20 కోట్ల నిధులు దుర్వినియోగమయ్యాయని, ఈ నిధుల మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. విచారణకు హాజరు కావాలని ఈడీ అజార్ ను కోరింది.

రూ.20కోట్ల దుర్వినియోగం
ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక పరికరాలు, క్యానోపీల కోసం కేటాయించిన రూ.20కోట్లను అజారుద్దీన్ దుర్వినియోగం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది అక్టోబరులో అజారుద్దీన్ పై మోసం, ఫోర్జరీ కేసులను పోలీసులు నమోదు చేశారు. . 20 కోట్ల రూపాయల మేర హెచ్‌సిఎ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ మూడు కేసులు పెట్టింది. తాజాగా ఆయనపై మనీలాండరింగ్ కేసు నమోదైంది.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో 2020 నుంచి 2023 వరకు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించగా, ప్రైవేటు ఏజెన్సీలకు నిధులను మళ్లించారని తేలింది. ఈ నిధుల దుర్వినియోగంపై హెచ్ సీఏ సీఈఓ సునీల్ కాంటే బోస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తనపై పోలీసులు పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితమని అజారుద్దీన్ ఆరోపించారు. ఈ కేసులో అజారుద్దీన్ కు గత ఏడాది నవంబరులో బెయిల్ మంజూరైంది.


Tags:    

Similar News