‘ఈగిల్’ బయటపెడుతున్న పబ్బుల గబ్బు కథలు..

హైదరాబాద్ గుండెల మీద పబ్స్ డ్రగ్స్ మరక....;

Update: 2025-07-11 01:39 GMT
డ్రగ్స్ దందాకు ఈగల్ టీం చెక్

తెలంగాణ రాష్ట్రంలో అందులోనూ హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్, గంజాయి విక్రయాలకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధీనంలోని ఈగల్ టీం తెరవేస్తుంది.(Eagle team busts drugs)డ్రగ్స్ పై నిరంతరం నిఘా వేసిన ఈగల్ టీం డ్రగ్స్ గుట్టును రట్టు చేస్తూ డ్రగ్ పెడ్లర్లకు అరదండాలు వేస్తుంది.తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయడానికి ఈగల్ టీం డ్రగ్స్ రాకెట్ సూత్రధారులను చాకచక్యంగా పట్టుకుంటుంది. ఈ టీం ఏర్పాటు తర్వాత కీలక మైన డ్రగ్స్ పెడ్లర్ల లింకులు వెలుగుచూశాయి.




 ఏమిటీ ఈగల్ టీం ?

డ్రగ్స్, గంజాయి ని గుర్తించేందుకు వీలుగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ఈగల్ టీం ను ఏర్పాటు చేసింది. గద్దల్లా ఈ బృందం డ్రగ్స్ ను పసిగట్టి సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై ఈగల్ టీం నిరంతరం నిఘా పెట్టి డ్రగ్స్ పెడ్లర్ల ఆట కట్టిస్తుంది. చెరువుల కబ్జాలను తొలగించేందుకు హైడ్రాను ఏర్పాటు చేసినట్లు డ్రగ్స్ ను నిర్మూలించేందుకు ఈగల్ టీంను సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ (EAGLE) పేరుతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామని,తెలంగాణలో ఉన్న కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ భూమిలో ఎక్కడ గంజాయి మొక్క పండించినా ఈ టీం పట్టుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గంజాయి ఆనవాళ్లను ఈగల్ టీం పట్టుకుంటుందని, వీరినే కాకుండా డ్రగ్స్ పెడ్లర్లే కాదు డ్రగ్స్ వినియోగదారులను గుర్తించి వారిని పట్టుకొని కేసులు పెడతామని సీఎం పేర్కొన్నారు.

పబ్ లలో డ్రగ్స్ విక్రయాల బాగోతం
మల్నాడు రెస్టారెంట్‌లో డ్రగ్స్ రాకెట్ అరెస్టుతో హైదరాబాద్ పబ్ లలో డ్రగ్స్ విక్రయాల బాగోతం బయటపడింది. కీలక సూత్రధారి సూర్య అరెస్టుతో నగరంలోని నైట్ లైఫ్ స్పాట్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్ బయటపడింది.ప్రిజం పబ్ (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్), ఫార్మ్ పబ్ (రోడ్ నం. 45, జూబ్లీ హిల్స్), బర్డ్ బాక్స్ (మాధపూర్), బ్లాక్ 22 (హైటెక్ సిటీ) పబ్ యజమానులు రాజా శ్రీకర్ (క్వేక్ అరీనా పబ్, కొండాపూర్), పృథ్వీ వీరమాచినేని (జోరా పబ్, రోడ్ నం. 36), రోహిత్ మెడిశెట్టి (బ్రాడ్‌వే పబ్, రోడ్ నం. 45) ప్రమేయంతో డ్రగ్స్‌తో కూడిన పార్టీలను నిర్వహించినట్లు అంగీకరించారు. దీంతో ఈ పబ్ ల యజమానులపై ఈగల్ టీం కేసులు నమోదు చేసింది. నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొరియర్ ద్వారా తెప్పించి పబ్ లు, కొందరు ప్రముఖులకు విక్రయిస్తున్నట్లు తేలింది.

మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా...
కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ యజమాని ఎ సూర్య వద్ద ఓజీ వీడ్, ఎక్సటసీ పిల్స్, కొకైన్ మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు.కీలకమైన డ్రగ్ పెడ్లర్ సూర్య అరెస్టుతో అతను నగరంలోని పలు పబ్ లకు మాదక ద్రవ్యాలను రవాణ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సూర్య తన టాటా స్కార్పియో వాహనంలో మల్నాడు రెస్టారెంట్ కు డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్లు సైబరాబాద్ నార్కోటిక్ పోలీసు ఇన్ స్పెక్టర్ పి రమేష్ రెడ్డికి జులై 7వతేదీన సమాచారం వచ్చింది. అంతే అతన్ని అడ్డగించి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మహిళా కొరియర్ పాదరక్షల్లో డ్రగ్స్ దాచగా పోలీసులు దాన్ని పట్టుకున్నారు.

నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు
నైజీరియా, ఢిల్లీలోని పరిచయాలతో విదేశీ డ్రగ్స్ సరఫరా దారుల నుంచి అతను మాదక ద్రవ్యాలను తెప్పించుకొని పబ్ లకు పంపిణీ చేసినట్లు వెల్లడైంది. నైజీరియన్ జాతీయుడు నిక్ నుంచి సూర్య కొరియర్ ద్వారా డ్రగ్స్ డెలివరీ తీసుకొని ఎస్పీఐ ద్వారా ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించినట్లు తేలింది. సూర్య నగరంలోని కొందరు బడా వ్యక్తులు, డాక్టర్లకు కూడా డ్రగ్స్ సరఫరా చేశాడని వెల్లడైంది. హైదరాబాద్ హాస్పిటాలిటీ, నైట్ లైఫ్ రంగంలో డ్రగ్స్ పంపిణీ చేశారని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రముఖ పబ్ లకు తాను డ్రగ్స్ ను పంపిణీ చేసినట్లు పెడ్లర్ సూర్య పోలీసుల ఇంటరాగేషన్ లో అంగీకరించాడు. సూర్య అందించిన సమాచారంతో నార్కోటిక్స్ కు చెందిన ఈగల్ టీం 9 పబ్ లపై దాడులు చేసి వాటిపై కేసులు నమోదు చేసింది. వాక్ కోరా పబ్, బ్రాడ్‌వే పబ్,క్వాక్ పబ్‌ల యజమానులను విచారించనున్నారు.

నైజీరియన్ మహిళలే కొరియర్లుగా...
నైజీరియన్ మహిళలే కొరియర్లుగా డ్రగ్స్ ను హైదరాబాద్ నగరంలో సప్లయి చేశారని దర్యాప్తులో వెలుగుచూసింది. ఒక గ్రాము సింథటిక్ డ్రగ్ చేరవేస్తే వెయ్యిరూపాయలు, అదే డ్రగ్స్ ను విక్రయిస్తే మూడు వేలరూపాయల చొప్పున డ్రగ్ పెడ్లర్లు చెల్లించారని తేలింది. సూడాన్ దేశానికి చెందిన ఓ యువతిని స్మగ్లర్లు ఏజెంటుగా మార్చి హైదరాబాద్ నగరానికి కొకైన్, ఎక్సటసీ పిల్స్ సరఫరా చేశారు.



 ఈగల్ టీం దాడులు ముమ్మరం

రెస్టారెంట్లు, పబ్ లు కేంద్రాలుగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ గుట్టును తెలంగాణ యాంటీ నార్కొటిక్ బ్యూరో (Anti Narcotics Bureau)ఈగల్ టీం రట్టు చేసింది. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈగల్ టీం డ్రగ్స్ రాకెట్ నిందితులతోపాటు డ్రగ్స్ తీసుకునే వారిపై కేసులు పెట్టింది.దాడులను ముమ్మరం చేసి డ్రగ్స్ ను ఈగల్ టీం పట్టుకుంటుంది.

ఎన్నెన్నో కేసులు...
- హైదరాబాద్ నగరంలోని నాంపల్లిలో ముంబయికు చెందిన అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా ఉందనే సమాచారంతో ఈగల్ టీం 100 గ్రాముల మెఫిడ్రోన్ డ్రగ్స్ ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది.
- సంగారెడ్డిలో అల్ఫాజోలంను పట్టుకొని ఈ రాకెట్ నిందితులకు చెందిన రూ.30కోట్ల విలువైన ఆస్తులను ఈగల్ టీం సీజ్ చేసింది. డ్రగ్స్ తో పాటు డ్రగ్స్ నిందితుల ఆస్తులను ఈగల్ టీం సీజ్ చేస్తుంది.
- విశాఖ ఎక్స్ ప్రెస్ లో 46 కిలోల గంజాయిని ఈగల్ టీం పట్టుకుంది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం పార్కింగ్ ఏరియా వద్ద 32 పిల్స్ డ్రగ్స్ ను సీజ్ చేసింది. జూనియర్ లెక్చరర్లు, విద్యాశాఖాధికారులను చైతన్యవంతులను చేసి వారి సహాయంతో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో చర్యలు చేపట్టింది.
- డ్రగ్స్ ఫ్రీ స్కూళ్లు లక్ష్యంగా తమ బృందం పనిచేస్తుందని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా చెప్పారు.
- రూ.1.25 కోట్ల విలువ గల 550 గ్రాముల సెలబ్రిటీ కొకైన్ ను టీజీనాబ్ అధికారులు సీజ్ చేసి, డ్రగ్ పెడ్లర్ నైజీరియన్ దేశస్థుడిని అరెస్టు చేశారు.
- డ్రగ్స్ హవాలా ముఠాల ఆర్థిక లింకులపై టీజీనాబ్ దృష్టి సారించి నైజీరియాకు వారం రోజుల్లోనే 2.1కోట్లరూపాయలను 150 బ్యాంకుల ద్వారా పంపించారని తేలింది.

ఎన్ డీ పీఎస్ యాక్ట్ కేసుల్లో యాంటిసిపేటరీ బెయిలు ఇవ్వొద్దు
ఎన్ డీ పీఎస్ యాక్ట్ కేసుల్లో యాంటిసిపేటరీ బెయిలు ఇవ్వవద్దని సాక్షాత్తూ సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది.పంజాబ్, హర్యానా హైకోర్టులు ఎన్ డీ పీఎస్ యాక్ట్ కేసుల్లో నిందితులకు బెయిలు తిరస్కరించాయి. ఎన్ డీ పీ ఎస్ కేసుల్లో నిందితులకు బెయిలు మంజూరు చేయవద్దని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పులను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ లు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.


Tags:    

Similar News