Dil Raju | ‘కేటీఆర్ మాటలు బాధాకరం.. ఇండస్ట్రీని వివాదాల్లోకి లాగొద్దు’

సినిమా పరిశ్రమ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.;

Update: 2024-12-31 12:15 GMT

సినిమా పరిశ్రమ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే రేవంత్.. అల్లు అర్జున్ అంశాన్ని పెద్దది చేస్తున్నారని, సినిమా వాళ్లతో సమావేశమవుతున్నారంటే కేటీఆర్ ఆరోపించారు. కాగా కేటీఆర్ వ్యాఖ్యలను తెలంగాణ ఫిలిం డెవెలప్‌మెంట్ ఛైర్మన్ దిల్ రాజు తీవ్రంగా ఖండించారు. సినీ పరిశ్రమను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తనకు ఎంతో బాధ కలిగించాయన్నారు. రాజకీయ వివాదాల్లోకి ఇంస్ట్రీని లాగొద్దని సూచించారు. సీఎం రేవంత్‌తో సినీ పెద్దల భేటీ కూడా ఇండస్ట్రీ అభివృద్ధి కోసమేనని, అదే అజెండాగా ఆ సమావేశం జరిగిందని అన్నారు. ఈ మేరకు దిల్ రాజు తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.

‘‘తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటున జరిగిన వ్యవహారం కాదని అందరికీ తెల్సిందే. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి.. రాష్ట్రాభివృద్ధికి, సామజిక సంక్షేమానికి, మా బాధ్యతగా తగిన సహకారం అందజేయాలని సీఎం గారు కాంక్షించారు. హైదరాబాదును గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా తీర్చదిద్దాలనే సీఎం బలమైన సంకల్పాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులుగా మేమందరం స్వాగతించడం జరిగింది. కాబట్టి అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని మా మనవి. రాజకీయ దాడి, ప్రతిదాడులకు దయచేసి పరిశ్రమను వాడుకోవద్దని అందరిని కోరుతున్నాం.లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న తెలుగు చిత్ర పరిశ్రమకు అన్ని ప్రభుత్వాల సహకారం, ప్రజలందరి ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని కోరారు దిల్ రాజు.

Tags:    

Similar News