రాడార్ స్టేషన్ శంకుస్థాపన.. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యమన్న రేవంత్

భారత నౌకాదళం కోసం తెలంగాణలో సరికొత్త రాడార్ స్టేషన్ నిర్మించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Update: 2024-10-15 09:43 GMT

భారత నౌకాదళం కోసం తెలంగాణలో సరికొత్త రాడార్ స్టేషన్ నిర్మించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా నేవీకి చెందిన ‘వెరీ లో ఫ్రీక్వెన్సీ’ వీఎస్‌ఎఫ్ కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌ రాడార్ కేంద్రానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ సహా పలువరు కీలక నేతలు, నేవీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కేంద్రానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లారు. ఈ స్టేషన్ నిర్మాణం కోసం అటవీశాఖకు చెందిన 2,900 ఎకరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఈస్టర్న్ నావెల్ కమాండ్’కు ఆరు నెలల క్రితమే అందించింది.

 

సీఎం చొరవతోనే సాధ్యమైంది: రాజ్‌నాథ్

‘‘14ఏళ్లు పెండింగ్‌లో ఉన్న రాడార్ స్టేషన్ నిర్మాణం సీఎం రేవంత్ రెడ్డి చూపిన ప్రత్యేక చొరవతోనే సాధ్యమైంది. దేశంలోనే రెండవ రాడార్ స్టేషన్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. దేశ భద్రత విషయంలో నేవీ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ రాడార్ స్టేషన్ నిర్మాణం ద్వారా సబ్ మెరైన్‌లతో కమ్యూనికేషన్ బలపడుతుంది. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు తగదు. సీఎం రేవంత్ రెడ్డి అందించిన సహకారం ఎప్పటికీ మరువలేదని’’ అని ఆయన పేర్కొన్నారు.

 

టౌన్‌షిప్‌కు అంతా రెడీ

రాడార్ కేంద్రంతో పాటు టౌన్‌షిప్ నిర్మాణం కోసం కూడా ప్రణాళికలు సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ టౌన్‌షిప్‌లో పాఠశాలలు, ఆసుపత్రులు, బ్యాంక్, మార్కెట్ వంటి అన్న సదుపాయాలు ఉండనున్నాయి. నేవీ యూనిట్‌లో దాదాపు 6వందల మంది ఉద్యోగులు, ఇతర సిబ్భంది ఉంటారు. మొత్తం టౌన్‌షిప్‌లో 2,500 నుంచి 3000 వేల మంది నివాసముంటారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించనున్నారు అధికారులు. కొత్త వీఎల్ఎఫ్ కేంద్రాన్ని 2027 లోపు పూర్తి చేయాలన్న లక్ష్యంగా పనులను పరుగులు పెట్టించనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా తాను పనిచేస్తానని చెప్పారు. అందుకోసం రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు.

 

ఇదో కీలక అడుగు

‘‘దేశ రక్షణలో తెలంగాణ కీలక అడుగు వేసింది. హైదరాబాద్ దేశ రక్షణకు సంబంధించిన నగరంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉంది. ఒక్కడ వీఎల్ఎఫ్ నిర్మాణంతో సముద్ర ప్రాంతం నుంచి చొరబడే ముష్కరుల నుండి మనం రక్షించపడుతుంది. ఈ విషయంలో కొందరు లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తమిళనాడులో 34 ఏళ్లుగా ఇప్పటికే ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా.. ఎటువంటి ప్రమాదం జరగలేదు. దేశ రక్షణకు సంబంధించిన విజయాన్ని కూడా రాజకీయం చేయడం తగదు. పదేళ్లు అబద్దాలు చెప్పారు. ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించిన అంశంలో కూడా బీఆర్ఎస్ నేతలు అవే అబద్ధాలు చెప్తున్నారు. కేంద్రం ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేస్తే ఇక్కడి విద్యార్థులకు మేలు జరుగుతుంది’’ అని సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రిని కోరారు. తెలంగాణను అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ రాజకీయాలకు అతీతంగా అందరికీ సహకరిస్తానని, అందరి సలహాలు, సూచనలు స్వీకరించడానికి వెనకాడనని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News