ఢిల్లీ హైకోర్టులోనూ ఎమ్మెల్సీ కవితకి లభించని ఊరట
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హై కోర్ట్ లో నేడు విచారణ జరిగింది. విచారణ అనంతరం బెయిల్ పిటిషన్ పై రిప్లై కోరుతూ సీబీఐ కి నోటీసులు ఇచ్చింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హై కోర్ట్ లో నేడు విచారణ జరిగింది. విచారణ అనంతరం బెయిల్ పిటిషన్ పై రిప్లై కోరుతూ సీబీఐ కి నోటీసులు ఇచ్చిన కోర్టు... తదుపరి విచారణ మే 24 కు వాయిదా వేసింది.
ఇప్పటికే లిక్కర్ పాలసీ ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై మే 10న ఢిల్లీ హైకోర్టు ఈడీకి నోటీసులు ఇచ్చింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్ల విచారణను న్యాయస్థానం మే24న చేపట్టనుంది.
ప్రస్తుతం లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయి జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. దర్యాప్తు సంస్థల కేసుల్లో రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మే 20 వరకు ఆమెకి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కవితను ఆరోజు తీహార్ జైలు అధికారులు వర్చువల్ గా రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హజరుపర్చనున్నారు.
కాగా, లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లను రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మే 6న కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో మార్చి 15న ఈడీ అధికారులు కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలోనే అరెస్ట్ చేశారు. తిహర జైలులో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న ఆమెను సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసింది. ఈ రెండు దర్యాప్తు సంస్థల కేసుల్లో బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హై కోర్టులో విచారణలు జరుగుతున్నాయి.