వాటర్ ట్యాంక్ లో శవం... 10 రోజులుగా ఆ నీళ్ళే తాగుతున్న నల్గొండ వాసులు

నాగార్జునసాగర్ నందికొండలో వాటర్ ట్యాంక్‌లో కోతుల కళేబరాల ఘటన మరువకముందే నల్గొండలో మరో దారుణం చోటు చేసుకుంది.

By :  Vanaja
Update: 2024-06-03 14:19 GMT

నాగార్జునసాగర్ నందికొండలో వాటర్ ట్యాంక్‌లో కోతుల కళేబరాల ఘటన మరువకముందే నల్గొండలో మరో దారుణం చోటు చేసుకుంది. నల్గొండ మున్సిపాలిటీలోని 11 వార్డు పాతబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంకులో అనుమానాప్పద స్థితిలో శవం లభించడం కలకలం రేపింది. అక్కడున్న మున్సిపాలిటీ సిబ్బంది వాటర్ ట్యాంకులో వాటర్ చెక్ చేయగా అందులో డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వాటర్ ట్యాంక్ లో ఉన్న మృతదేహం హనుమాన్ నగర్‌ కు చెందిన ఆవుల వంశీగా పోలీసులు గుర్తించారు. అతడు పది రోజుల క్రితం నుంచి కనిపించకపోవడంతో మిస్సింగ్‌ కేసు నమోదైయింది. అయితే వంశీ ఆత్మహత్య చేసుకున్నా డా? లేక ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా అనే విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, అవే నీళ్లను 10 రోజులుగా నల్గొండ మున్సిపాలిటీ ప్రజలు తాగుతున్నారు. కలుషిత నీటిని 10 రోజుల నుంచి వాడామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

వాటర్ ట్యాంక్ లో కోతుల కళేబరాలు...

నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్‌ లో ఇటీవల కోతుల కళేబరాలు లభించడం కలకలం రేపింది. వాటర్ ట్యాంకు పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్ళిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందినట్లు భావించారు. దాదాపు 30 నుండి 40 వరకు కోతుల మృతదేహాలు నీటిలో తేలుతున్నాయి. అయితే అవే నీరు కొన్ని రోజులు ప్రజలకు తాగునీటి కోసం సరఫరా అయ్యాయి.

కేటీఆర్ సీరియస్...

నల్గొండ వాటర్ ట్యాంక్ లో 10 రోజులుగా మనిషి శవం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మండిపడ్డారు. ప్రజలపాలనతో చెలగాటమాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలన.. కోతల్లేని కరెంట్ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరు.. కోతులు పడి చనిపోయినా వాటర్ ట్యాంకులను పట్టించుకోరు. చివరికి.. నల్గొండలోని నీటిట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరు. సాగర్ ఘటన స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే.. కాంగ్రెస్ సర్కారులో మళ్లీ అదే నిర్లక్ష్యం.. అదే నిర్లిప్తత.. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కారిది. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది. మిషన్ భగీరథ పథకంతో.. దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వమిది. గుర్తుంచుకోండి.. జలమే జగతికి మూలం.. ఈ సర్కారు తీరు మారకపోతే... జనమే కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయం" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News