హైదరాబాద్‌లో రోజుకో రకం సైబర్ క్రైమ్ మోసాలు
హైదరాబాద్ నగరంలో రోజుకో రకం నయా సైబర్ క్రైం మోసాలు జరుగుతున్నాయి. విద్యావంతులు, వృద్ధులు ఈ సైబర్ మోసాల బారిన పడి బ్యాంకు ఖాతాల్లో డబ్బు పోగొట్టుకుంటున్నారు.
By : Shaik Saleem
Update: 2024-11-07 13:05 GMT
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా నయా సైబర్ క్రైం మోసాలు సాగుతూనే ఉన్నాయి.ఒకే రోజు రెండు సైబర్ క్రైం మోసాలు వెలుగుచూశాయి.
- చట్టవిరుద్ధ కార్యక్రమాలు, మనీలాండరింగ్ కేసు పేరిట హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని సీబీఐ అధికారి పేరిట బెదిరించి రూ.48 లక్షల రూపాయలు స్వాహా చేశారు.
- హైదరాబాద్ నగరానికి చెందిన ఓ గృహిణి ఫోన్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి, ఆమె ఖాతా నుంచి రూ.1,44,998లను డ్రా చేశారు.
సీబీఐ పేరిట బెదిరించి...
హైదరాబాద్‌కు చెందిన 55 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగికి ఢిల్లీలోని సీబీఐ అధికారి పేరిట కాల్ వచ్చింది. బాధితుడు మనీలాండరింగ్ కేసు, చట్టవిరుద్ధ కార్యకలాపాలలో పాల్గొన్నాడని సైబర్ నేరగాడు ఆరోపించాడు. బాధితుడికి ఢిల్లీలో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో అక్రమ బ్యాంక్ ఖాతా ఉందని, అందులోకి ఇతర ఖాతాల నుంచి రూ.20-30 కోట్లు జమ అయ్యాయని ఆరోపించాడు.బాధితుడిని నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌తో అరెస్టు చేస్తామని,దీనివల్ల ఉద్యోగం పోతుందని బెదరించాడు.ఈ సమాచారం అత్యంత గోప్యమైనదని, ఎవరికీ లీక్ చేయకూడదని సైబర్ నేరగాళ్ల తరపున ఓ మహిళ చెప్పింది.అరెస్టు నుంచి బయట పడాలంటే తక్షణమే ఆర్టీజీఎస్ ద్వారా డబ్బు పంపించాలని కోరారు.దీంతో బాధితుడు ఆర్టీజీఎస్ ద్వారా డబ్బు పంపాడు.
గృహిణి ఫోన్ హ్యాక్ చేసి...
హైదరాబాద్‌కు చెందిన 38 ఏళ్ల గృహిణి జెప్టో యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేసింది. దీని తర్వాత జెప్టో ఉద్యోగి వలె నటిస్తూ ఒకరి నుంచి ఆమెకు వాట్సాప్ సందేశం వచ్చింది.అనంతరం బాధితురాలికి స్కామర్ నుంచి కాల్ వచ్చింది, అతను ఖాతా నుంచి డెబిట్ చేయబడిందో లేదో తనిఖీ చేయమని ఆదేశించాడు, ధృవీకరణ కోసం ఆమెకు లింక్‌ను పంపాడు.స్కామర్ కొన్ని సూచనలను అందించాడు. బాధితురాలిని తన స్క్రీన్‌ను షేర్ చేయమని అడిగాడు. వారు ఆమెకు ఏపీకే లింక్‌ను కూడా పంపారు. బాధితురాలు లింక్‌ను తెరిచి, ఆమె డేటాను అప్‌లోడ్ చేసి, అభ్యర్థించిన సమాచారాన్ని పూరించింది. బాధితుడు ఎలాంటి ఓటీపీ లేదా కార్డ్ వివరాలను పంచుకోలేదు. అయితే, వీడియో కాల్ సమయంలో స్కామర్ ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశాడు.బాధితురాలు తన క్రెడిట్ కార్డ్ వివరాలను పంచుకున్నప్పుడు, ఆమె వెంటనే కస్టమర్ కేర్‌కు కాల్ చేసి, సమస్యను వివరించి, తన బ్యాంక్ లావాదేవీలను బ్లాక్ చేసింది. ఆమె త్వరితగతిన చర్యలు తీసుకున్నప్పటికీ, ఆమె ఖాతా నుంచి రూ.1,44,998 డెబిట్ అయింది.దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు సైబర్ పోలీసులను కోరింది.
డిజిటల్ అరెస్ట్ ఉండదు...
సీబీఐ,ఆర్బీఐ, ఈడీ, కస్టమ్స్, న్యాయమూర్తులు, సైబర్ క్రైమ్ పోలీసులు, నార్కోటిక్స్, ఫెడెక్స్, బీఎస్ఎన్ఎల్,ట్రాయ్ మొదలైన వాటికి సంబంధించిన ఏవైనా బెదిరింపు వీడియో కాల్‌లు వస్తే భయపడవద్దని హైదరాబాద్ సైబర్ పోలీసులు కోరారు.పోలీసు వ్యవస్థలో డిజిటల్ అరెస్ట్, విచారణ లేదని వారు పేర్కొన్నారు. ఏ ప్రభుత్వ ఏజెన్సీ లేదా చట్టాన్ని అమలు చేసే అధికారులు అలాంటి స్కైప్ కాల్‌లు చేయరని, సమస్యను క్లియర్ చేయడానికి డబ్బు డిమాండ్ చేయరని సైబర్ పోలీసులు స్పష్టం చేశారు.
మోసానికి గురైతే 1930కి కాల్ చేయండి
గుర్తు తెలియని వ్యక్తుల తప్పుడు వాగ్దానాలను నమ్మి తెలియని బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు.ఎవరైనా సైబర్ క్రైమ్ మోసానికి గురైనట్లయితే, వెంటనే 1930కి కాల్ చేయాలని కోరారు.
In case of any emergency of cybercrime frauds please call or WhatsApp 8712665171.
— Cyber Crimes PS Hyd City Police (@CyberCrimeshyd) October 7, 2024
Follow us on below links for latest cyber awareness updates. https://t.co/oz004gpfj3https://t.co/fJe7Qeo2C4https://t.co/Nu0voTZLoz
cybercrimesphyd@gmail.comhttps://t.co/NDLwUr40wJ pic.twitter.com/FHDpi6rlXI