కాంగ్రెస్ నాయకుడి అనుమానాస్పద మృతి..

అనిల్ డ్రైవ్ చేస్తున్న కారు కడప జిల్లా టీడీపీ నేత కుమారుడిదిగా పోలీసులు గుర్తించారు.;

Update: 2025-07-15 06:57 GMT

మెదక్ జిల్లా కోల్చారం మండలం పైతరకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మారెల్లి అనిల్ మృతిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. తొలుత రోడ్డు ప్రమాదంగా భావించిన అనిల్ మరణం.. కొత్తగా బుల్లెట్ల కోణం వెలుగు చూడటంతో హత్య రంగును పులుముకుంది. అతడిని ఎవరైనా ప్లాన్ ప్రకారం హతమార్చారా? లేదంటే ప్రమాదమేనా? హత్య అయితే ఎవరు చేయించి ఉంటారు? ఎవరు చేసి ఉంటారు? అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఇందులో రాజకీయ కోణం ఉందా? ఇలా అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ కుడి భుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అనిల్‌ది హత్యా? ఆత్మహత్య? అన్న కోణంలో కూడా విచారిస్తున్నట్లు ఎస్సై మహ్మద్ గౌస్ చెప్పారు. పోస్ట్‌ మార్టం అనంతరం అనిల్ మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అసలేం జరిగిందంటే..

మారెల్లి అనిల్.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. అదే విధంగా ఓ పెట్రోల్ బంక్‌ను కూడా నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఆయన తన కారులో మెదక్ నుంచి స్వగ్రామానికి బయల్దేరారు. ఆ సమయంలోనే కొల్చారం మండలం చిన్నఘనపూర్ విద్యుత్తు సబ్‌స్టేషన్ దగ్గర కారు అదుపు తప్పింది. కల్వర్టును ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అనిల్‌ను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనిల్ మరణించారు. కాగా ఘటనాస్థలాన్ని పరిశీలిస్తుండగా బులెట్ల వ్యవహారం వెలుగు చూసిందని, దీంతో అనిల్ మరణంపై అనేక అనుమానాలు రేకెత్తాయని పోలీసులు తెలిపారు. ఇప్పుడు అనేక కోణాల్లో అతని మరణాన్ని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గౌస్ చెప్పారు.


అనిల్ వాడిన కారు టీడీపీ నేత కుమారిదే..!

అనిల్ మృతి కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. మరణించిన సమయంలో అనిల్ డ్రైవ్ చేస్తున్న కారు కడప.. టీడీపీ నేత కుమారుడిదిగా పోలీసులు గుర్తించారు. సదరు టీడీపీ ఎమ్మెల్యే కుమారుడికి, అనిల్‌కు మధ్య కొంతకాలంగా భూవివాదం ఒకటి నడుస్తోంది. గత ఐదు నెలలుగా బెంజ్ కారు.. అనిల్ దగ్గరే ఉంది. ఈ సమాచారంతో అనిల్ మృతి కేసులో మరో కీలక మలుపు తీసుకుంది. అసలేంటా భూ వివాదం? అనిల్ మరణానికి అదే కారణమా? ఐదు నెలలు టీడీపీ నేత కుమారిడి కారు అనిల్ దగ్గర ఎందుకు ఉంది? ఇలాంటి అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

Tags:    

Similar News