రెండుపార్టీలు ఈ ఎంఎల్ఏకే గాలమేస్తున్నాయా ?

తెలంగాణాలోని రెండుపార్టీల మధ్య పోటీ పెరిగిపోతున్నట్లే ఉంది. రెండుపార్టీలు మరింతగా బలోపేతం అవ్వటానికి బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నాయి.

Update: 2024-06-27 07:19 GMT

తెలంగాణాలోని రెండుపార్టీల మధ్య పోటీ పెరిగిపోతున్నట్లే ఉంది. రెండుపార్టీలు మరింతగా బలోపేతం అవ్వటానికి బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో ఎంతమందిని వీలుంటే అంతమందిని లాగేసుకునేందుకు రెండు పార్టీలు గట్టిగా ప్లాన్ చేస్తున్నాయి. ఆమధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 సీట్లను గెలుచుకున్నది. అందుకనే బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో గాలంవేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇపుడు విషయం ఏమిటంటే పఠాన్ చెరువు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి విషయం హాట్ టాపిక్ అయ్యింది. కొంతకాలంగా గూడెం బీఆర్ఎస్ యాక్టివిటీస్ కు దూరంగా ఉంటున్నారు. కేసీయార్, కేటీయార్ తో టచ్ లో ఉండటంలేదు. ఈ నేపధ్యంలోనే గూడెం ఒకరోజు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. దాంతో తొందరలోనే ఎంఎల్ఏ కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోయింది. అయితే సడెన్ గా ఏమయ్యిందో ఏమో ఎంఎల్ఏ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. రేవంత్ కూడా అదే సమయంలో ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి గూడెం పార్టీలో చేరటమే మిగిలిందని అనుకున్నారు. కాని అనూహ్యంగా ఎంఎల్ఏ బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. జహీరాబాద్ మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బీబీ పాటిల్ తో గూడెం చాలాసేపు భేటీ అయ్యారట. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని బీజేపీ నేతలతో కూడా ఎంఎల్ఏ ఢిల్లీలోనే సమావేశమైనట్లు ప్రచారం జరుగుతోంది.

అసలు గూడెం ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు ?

ఎందుకంటే, ఈమధ్యనే ఎంఎల్ఏ వ్యాపారాలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేశారు. క్రషర్లు, గ్రానైట్ వ్యాపారాల్లో ఎంఎల్ఏ సోదరులు చాలా బిజీగా ఉంటారు. తమకిచ్చిన అనుమతులకు మించి వీళ్ళ కంపెనీ క్రష్షింగ్ చేసిందనే ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణల ఆధారంగానే వీళ్ళ కంపెనీపై ఈడీ దాడులు చేసింది. చాలా డాక్యుమెంట్లను సీజ్ చేయటమే కాకుండా పరిమితికి మంచి తవ్వకాలు జరిపాయని, పన్నులు ఎగ్గొట్టారనే ఆరోపణలపై కంపెనీ మీద కేసులు నమోదుచేయటమే కాకుండా భారీ జరిమానా కూడా విధించింది. ఈ విషయంలో ఈడీ అధికారులతో మాట్లాడేందుకు, కోర్టులో కేసు వేయటానికే ఎంఎల్ఏ ఢిల్లీకి వెళ్ళినట్లు ఆయన మద్దతుదారులు చెప్పారు. అయితే బీజేపీ నేతలతో భేటీ అయ్యారన్న విషయం బయటపడటంతో ఎంఎల్ఏ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.

అంటే దాడులు, కేసులతో బీజేపీ ఎంఎల్ఏలను భయపెట్టి లాక్కోవాలని చూస్తోందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారా లేకపోతే బీజేపీలో చేరుతారా ? అన్నదే ఇపుడు పాయింట్. కాంగ్రెస్ లో చేరితే రాష్ట్రప్రభుత్వం పరిధిలో ఎంఎల్ఏకి అన్నీరకాల రక్షణలు దొరుకుతాయనటంలో సందేహంలేదు. అదే బీజేపీలో చేరితే ఇపుడు ఈడీ కేసులు, దాడుల ఒత్తిడినుండి బయటపడచ్చు. ఎంఎల్ఏ తక్షణ సమస్య ఈడీ కేసుల నుండి బయటపడటమే అయితే తొందరలోనే బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువ. మరి ఇపుడు మహిపాల్ రెడ్డి విషయంలో జరిగినదే ముందు ముందు మరింతమంది ఎంఎల్ఏల విషయంలో కూడా జరుగుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరితే అధికారం సుస్ధిరమవుతుంది. అదే బీజేపీలో చేరితే పార్టీ మరింతగా బలపడుతుంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News