గిరిజన బాలిక కల నెరవేర్చిన సీఎం
డాక్టర్ కావాలని గిరిజన బాలిక కన్న కలలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నెరవేర్చారు. కుమురంభీం జిల్లాకు చెందిన బాలికకు సీఎం ఆర్థిక సాయం అందించారు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయిశ్రద్ధ నీట్‌లో ఎస్టీ విభాగంలో 103 వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకుతో మెడిసిన్ సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రాగానే ఆయన వెంటనే స్పందించారు. ఆ గిరిజన విద్యార్థిని కలను నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం హామీ ఇచ్చారు.
డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్‌లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఆర్ధిక సాయం అందించారు.
— Telangana CMO (@TelanganaCMO) October 30, 2024
* కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ… https://t.co/BKDdxAHKFW pic.twitter.com/eFe5jED8FV
పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ మోడం వంశీకి సీఎం అభినందన
పవర్ లిఫ్టింగ్ క్రీడలో ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగిన ఆదివాసీ బిడ్డ, భద్రాచలం ఏజెన్సీ మారుమూల ఇప్పగూడెంలో పుట్టి ఇప్పుడు ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న పవర్ లిఫ్టర్ మోడం వంశీ గారు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
— Telangana CMO (@TelanganaCMO) October 29, 2024
🔹మాల్టాలో జరిగిన… pic.twitter.com/MqUHemEDvV