Revanth Reddy | ‘అల్లు అర్జున్‌కి మానవత్వం లేదు’

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు చర్చ జరిగింది.

Update: 2024-12-21 10:09 GMT

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు చర్చ జరిగింది. ఈ అంశంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. నటుడు అల్లు అర్జున్‌పై, ఫిలిమ్ స్టార్స్‌పై మండిపడ్డారు. వాళ్ల పద్దతి ఏంటో, ఆలోచన ఏంటో తనకు అర్థం కావట్లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరడంతో దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సంధ్యథియేటర్‌కు వెళ్లడానికి ఒకదే దారి ఉందని, సినీ తారలు, ప్రముఖులను ఆ రోజు అక్కడకు రానివ్వొద్దని పోలీసులు చెప్పినా లెక్క చేయకుండా అల్లు అర్జున్.. థియేటర్‌కు వచ్చాడని, అంతేకాకుండా ఆ ప్రాంతంలో ర్యాలీ కూడా నిర్వహించాడని చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం బాధ్యతాయుతంగా అల్లు అర్జున్ ప్రవర్తించలేదని, అతని బాధ్యతారాహిత్యమే ఈ ప్రమాదానికి మూలకారణమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారు. పోలీసులు సూచనలను తుంగలో తొక్కుతూ థియేటర్‌కు ఆయన ఎందుకు వచ్చారో.. ఆయనకే తెలియాలని అన్నారు.

దీనిపై అందుకే స్పందిస్తున్నా..

‘‘సంధ్య థియేటర్ ఘటన అంశంపై అసెంబ్లీలో చర్చకు వస్తుందని అనుకోలేదు. సదరు సభ్యుడిని డిమాండ్ మేరకు నేను దీనిని ప్రస్తావించాల్సి వస్తోంది. ఇలా చేస్తే ఈ ఘటనపై దర్యాప్తు చేరస్తున్న అధికారి చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఈ అంశం ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న క్రమంలో పెద్దగా మాట్లాడటం కరెక్ట్ కాదు. డిసెంబర్ 4న పుష్ప-2 సినిమా విడుదలైంది. ఆ రోజు ప్రీమియర్స్ షో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అందులో నటించిన హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ మరికొంత మంది సంధ్యథియేటర్ వస్తుస్తున్నారు. బందోబస్తు కావాలి అని థియేటర్ యాజమాన్యం 2వ తేదీన దరఖాస్తు చేసుకున్నారు. మరుసటి రోజే చిక్కడపల్లి సీఐ లిఖితపూర్వకంగా థియేటర్ యాజమాన్యానికి సమాధానం పంపారు’’ అని తెలిపారు. ‘‘సంధ్య థియేటర్ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు బాగా ఉన్నాయి. థియేటర్‌కు ఎంట్రీ, ఎగ్టిట్ ఒకటే ఉన్నాయి. అటువంటి సమయంలో అక్కడకు సెలబ్రిటీలు వస్తే ప్రజలకు అదుపు చేయడం కష్టమవుతుంది. కాబట్టి ఎవర్నీ థియేటర్‌కు రానివ్వొద్దు. మీరు పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరిస్తున్నాం’’ అని పోలీసులు బదులిచ్చారని సీఎం వివరించారు.

‘‘పోలీసులు థియేటర్ పెట్టుకున్న దరఖాస్తున్న నిరాకరించినా అల్లు అర్జున్ మాత్రం పట్టించుకోకుండా ప్రీమియర్ షోకు వచ్చాడు. థియేటర్‌కు కొంత దూరం నుంచే తన కారు రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుతూ ర్యాలీలా థియేటర్ దగ్గరకు చేరుకున్నాడు. దాంతో నటుడిని చూడటం కోసం థియేటర్‌లోని అభిమానులంతా అక్కడు చేరుకున్నారు. హీరో కారును థియేటర్ లోపలికి పండం కోసం గేట్లు తెలిచారు. ఒకేసారి వందల సంఖయలో అభిమానులు థియేటర్ లోపలికి రావడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కసలాట జరిగింది. అందులో రరేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ.. బ్రెయిన్ డ్యామేజ్ అయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది’’ అని చెప్పారు.

‘‘పరిస్థితి చేయిదాటిపోయింది. ఇక్కడి నుంచి వెంటనే వెళ్లిపోవాలని అల్లుఅర్జున్‌కు చెప్పడానికి పోలీసులు ఎంగానో ప్రయత్నించారు. కానీ థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ ఆయన దగ్గరకు పోలీసులను వెళ్లనివ్వలేదు. దీంతో పోలీసులు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అప్పుడు రంగంలోకి దిగిన ఏసీపీ.. అల్లు అర్జున్ సహా అంతా వెళ్లిపోవాలని, శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయని చెప్పారు. కానీ సినిమా చూడకుండా తాను కదిలే ప్రసక్తే లేదని అర్జున్ అన్నారని సిటీ కమిషనర్ నాతో చెప్పారు. దాంతో ఆగ్రహించిన పోలీసులు.. అరెస్ట్‌లు చేయాల్సి వస్తుందని, పరిస్థితి వివరించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లడానికి అల్లు అర్జున్ అంగీకరించారు. అయితే తిరిగి వెళ్లే సమయంలో కూడా కార్ రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుకుంటూ వెళ్లారు. ఒక మహిళ చనిపోయింది, బాలుడు కోమాలో ఉన్నాడని తెలిసినా అల్లు అర్జున్.. అదే పద్దతి కొనసాగించారు. అల్లు అర్జున్‌కి మానవత్వం అనేదే లేదు. ఈ కేసులో ఇప్పటికే అల్లు అర్జున్‌తో పాటు మరికొంత మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది’’ అని సీఎం వివరించారు.

‘ఏం చేశాడని పరామర్శిస్తున్నారు’

ఈ సందర్భంగానే అల్లు అర్జున్ అరెస్ట్ కావడంపై కూడా రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘అల్లు అర్జున్.. ఒక్కరోజు ఒక ఆరు గంటలకు గావాల్న జైలుకు పోయి వచ్చిండు. ఒక్క రోజు అరెస్ట్ చేసిండ్రు. అంతే ప్రభుత్వాన్ని తిడుతున్నారు. నన్ను తిడుతున్నారు. సినీ ప్రముఖులంతా అల్లు అర్జున్న ఇంటి మందు క్యూలు కట్టి పరామర్శిస్తున్నారు. ఏమైందని.. ఆయనకేమైన కన్ను పోయిందా.. కాలు పోయిందా.. చేయి పోయిందా.. అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు కలిసి పరామర్శించారు, అభినందించారు. కానీ ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతున్న ఆ బాలుడిని పరామర్శించడానికి ఒక్కరు కూడా ముందుకు రానీ ఈ సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ ఏం ఆలోచిస్తుందో నాకు తెలియట్లేదు’’ అంటూ మండిపడ్డారు.

Tags:    

Similar News