'తెలుగు' కేంద్రమంత్రులకు రేవంత్ రెడ్డి రిక్వెస్ట్

తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వీరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఓ రిక్వెస్ట్ కూడా చేశారు.

By :  Vanaja
Update: 2024-06-10 10:52 GMT

నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రి వర్గం కొలువుదీరింది. ఆదివారం రాష్ట్రపతిభవన్ లో ప్రధాని మోదీ సహా 72 మంది యూనియన్ మినిష్టర్లుగా ప్రమాణస్వీకారం చేశారు. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ క్యాబినెట్ లో చోటు దక్కించుకోగా, ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ రెడ్డి, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ లకు కేంద్ర క్యాబినెట్ లో అవకాశం లభించింది. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వీరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి. కిషన్ Revanth Reddy

Pemmasani Chandrasekhar

Rammohan Naidu

Bandi Sanjay

Kishan Reddyరెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు చెప్పారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరారు.

మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం...

నరేంద్ర మోదీ మూడవసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఆదివారం రాత్రి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. మోదీ కొత్త మంత్రివర్గంలో 30మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదాలో సహాయమంత్రులు, 36 మంది సహాయమంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో మోదీతో కలిపి కేంద్ర మంత్రివర్గంలో మొత్తం 72 మందికి స్థానం లభించినట్లయ్యింది. ముందుగా మోదీ చేత రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.

ఇక తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మలు కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. కేరళ నుంచి ఎన్నికైన ఒకేఒక్క బీజేపీ ఎంపీ, సినీ నటుడు సురేశ్ గోపీ తో పాటు... పార్టీలో నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న అదే రాష్ట్రానికి చెందిన క్రైస్తవ నేత కురియన్ కి పార్లమెంటులో సభ్యత్వం లేనప్పటికీ మంత్రి పదవి ఇచ్చారు. పంజాబ్ లోని లూధియానా నుంచి ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ రవీందర్ సింగ్ బిట్టూకు మంత్రి వర్గంలో స్థానం దక్కింది.

Tags:    

Similar News