Revanth Reddy | దావోస్‌లో సీఎం రేవంత్ తొలి ఒప్పందం..

తెంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025 వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు.;

Update: 2025-01-21 12:34 GMT

తెంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2025 వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం దావోస్‌లో తొలి ఒప్పందం చేసుకుంది. యూనిలీవర్ సీఈఓ హయన్ షూమాకర్, చీఫ్ సప్లైచైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్‌తో సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం చర్చలు జరిపారు. ఈ చర్యల అనంతరం తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వారు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం చేసుకుంది.

యూనిలీవర్ కంపెనీ గ్లోబల్ సీఈఓతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి యూనిలీవర్ ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకుందని తెలంగాణ ప్రతినిధుల బృందం వెల్లడించింది. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే యూనిలీవర్ పేరొందిన బ్రాండ్‌గా ఉంది. ఆ సంస్థ ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి రెడీ కావడం కీలకంగా మారింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి యూనీలివర్ అంగీకిరంచింది. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి సంసిద్దతను వ్యక్తం చేసిందని సీఎం బృందం తెలిపింది.

Tags:    

Similar News