ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం..

స్కిల్ యూనివర్సిటీ అంశంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.;

Update: 2025-01-17 08:46 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. రైజింగ్ తెలంగాణ అజెండాగా విదేశీ పర్యటనలు చేస్తున్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా పలు దేశాలతో ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ క్రమంలో రేవంత్ తొలి ముందడుగు వేశారు. తన విదేశీ పర్యటనలో భాగంగా తొలుత సింగపూర్‌కు చేరుకున్నారు రేవంత్. ఈ సందర్భంగా సింగపూర్ యూనివర్సిటీ ఐటీఐ(ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్)తో ఎంఓయూ కుదుర్చుకున్నారు. యువతను ఉద్యోగ సంసిద్ధులుగా మార్చాలన్న ఉద్దేశంతో తెలంగాణలో రేవంత్ చేపట్టిన ప్రాజెక్ట్ స్కిల్ యూనివర్సిటీ. ఆ కలను సాకారం చేసుకోవడం కోసం ఐటీఈతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఐటీఈ వైస్ ఛాన్సలర్ సుబ్బారావు, ఐటీఈ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్‌తో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

సింగపూర్ ఐటీఈలో సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి సహా 20కి పైగా విభిన్న డొమైన్‌ల పనితీరును ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పరిశీలించింది. ఆయా రంగాలలో పనిచేస్తున్న నిపుణులు, సిబ్బందితో ముఖ్యమంత్రి గారు సంభాషించారు. తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ముందుకొచ్చిన సింగపూర్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, సెంట్రల్ కాలేజీతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్య కీలకమైన ఒప్పందం కుదిరింది. ఐటీఈ పరిశీలన అనంతరం జరిగిన చర్చలు, సంప్రదింపుల మేరకు తెలంగాణలో స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించనుంది.

సింగపూర్ ఐటీఈ.. పదో తరగతి చదివే విద్యార్థుల దగ్గర నుంచి ఆసక్తి ఉన్న ఏ వయసు వారికయినా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో జాబ్ రెడీ శిక్షణ అందిస్తుంది. ‘స్కిల్ ఫర్ ఫ్యూచర్, స్కిల్ ఫర్ లైఫ్’ అనే నినాదంతో ఈ యూనివర్సిటీ పనిచేస్తుంది. ఐటీఈలో ప్రస్తుతం 28వేల మంది శిక్షణ పొందుతున్నారు. ఇందులో వంద ఫుల్‌టైమ్ కోర్సులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ శిక్షణ అందుబాటులో ఉంది. ఐటీఈకి ఐదు వేల పరిశ్రమలతో భాగస్వామ్యం ఉంది. పరిశ్రమలు తమకు కావాల్సిన మానవ వనరులకు నేరుగా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పిస్తాయి. అదే స్ఫూర్తితో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పడుతోంది. ఇందులో శిక్షణ ఇచ్చే వారికి ఐటీఈతో ట్రైయినింగ్ ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం స్కిల్ యూనివర్సిటీ లక్ష్యాలను అందుకోవడంలో ఎంతో సహాయపడుతుందని సదరు వర్సిటీ అధికారులు చెప్తున్నారు.

Tags:    

Similar News