భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంస
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరు మరోసారి వార్తల్లో నిలిచారు.ఇంకుడుగుంతల నిర్మాణంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసలు అందుకున్నారు.;
దేశంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇంకుడు గుంతల నిర్మాణంలో అగ్రస్థానంలో నిలిచింది. భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్ జితేశ్ వి పాటిల్ చొరవ తీసుకొని అత్యధికంగా ఇంకుడు గుంతలు తవ్వించారని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. జల్ సంచాయ్ - జన్ బాగీదారి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఇలా ఒకటేమిటి జిల్లా వ్యాప్తంగా 29,103 ఇంకుడు గుంతలను నిర్మించినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటితోపాటు జాతీయ ఉపాధి హామి పథకం కింబద మరో 2,581 సోక్ పిట్స్, 1100 నీటి గుంటల నిర్మాణం చేపట్టామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ చెప్పారు.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరుకు కేంద్రం ప్రశంస
కూలీలతో కలిసి కలెక్టర్ ఉపాధి పనులు
ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవం