కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పోటీ ర్యాలీ..!
ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా ర్యాలీలు చేస్తున్న పార్టీలు.;
తెలంగాణలో ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మధ్య ఓ చిన్న పోటీ జరుగుతుంది. అదేంటంటే దేశభక్తి పోటీ. ఆపరేషన్ సింధూర్‌కు మద్దతుగా రెండు పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ‘ఆపరేషన్ సిందూర్’ సర్జికల్ స్ట్రైక్స్‌పై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. భద్రతా దళాలకు సంఘీభావంతో సాలిడారిటీ ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కూడా ప్రత్యేక ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో దేశభక్తిని చాటుకోవడంలో రెండు పార్టీలు పోటీ పడుతున్నట్లు చర్చ మొదలైంది. అదే సమయంలో రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి.
కాంగ్రెస్ సాలిడారిటీ ర్యాలీ
బుధవారం సాయంత్రం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో మే8న సాయంత్రం 6గంటలకు భారీ ర్యాలీ నిర్వహించాలని నిశ్చయించింది. ఈ సాలిడారిటీ ర్యాలీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు కూడా పాల్గొంటారు. ఈ ర్యాలీ తెలంగాణ సెక్రటేరియట్ నుంచి సెక్లెస్ రోడ్ వరకు జరుగుతుంది. ఈ ర్యాలీలో ప్రజలకు కూడా భాగస్వాములు కావొచ్చు. ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో రక్షణ, పోలీస్, విపత్తుల నిర్వహణ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్ జాగృతి ర్యాలీ
గురువారం కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించగా శుక్రవారం అంటే మే 9న బీఆర్ఎస్ ‘జాగృతి ర్యాలీ’ పేరిట భారీ ర్యాలీకి రెడీ అయింది. ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా పీపుల్స్ ప్లాజా నుంచి సెక్రటేరియట్ పక్కనే ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా పాల్గొననున్నారు. ఈ మేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్ సిందూర్ ను ప్రతి ఒక్కరూ బలపరచాల్సిన అవసరం ఉందని, ఉగ్రవాదంపై వీరోచితంగా పోరాడుతున్న భారత సైన్యానికి ప్రజలంతా దన్నుగా నిలవాలని తెలంగాణ జాగృతి సంస్థ విజ్ఞప్తి చేసింది. అందులో భాగంగా భారత సైన్యానికి మద్దతుగా నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజలు, యువత పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది.
ఇవి దేశభక్తి ర్యాలీలో.. పోటీ ర్యాలీలా..
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతుగా ర్యాలీలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో వేరువేరుగా ఎందుకు కలిసి ర్యాలీ చేయొచ్చు కదా? ఐకమత్యాన్ని చాటాలనుకున్నప్పుడు కలిసి కదం కదపాలి కానీ వేరువేరుగా ఎందుకు? కాంగ్రెస్ ర్యాలీ చేస్తుండటంతో తామూ ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ కూడా ర్యాలీని ప్రకటించిందా? ఇలా ప్రజల నుంచి అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో పార్టీలకు అతీతంగా ఉండాలని చెప్పిన రేవంత్ రెడ్డి.. సాలిడారిటీ ర్యాలీకి అన్ని పార్టీల నేతలను ఎందుకు ఆహ్వానించలేదు? అన్న ప్రశ్న కూడా గట్టిగా వినిపిస్తోంది. ఈ పార్టీలు చేస్తున్న ర్యాలీల్లో పోటీ తత్వం కనిపిస్తుందే తప్ప.. దేశ భక్తి కనిపించడం లేదని? కూడా కొందరు విశ్లేషకులు అంటున్నారు.