ఛారిటీ నిధులతో కొడంగల్ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం
సీఎం ఎ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త.ఛారిటీ నిధులతో విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనున్నారు.
By : Shaik Saleem
Update: 2024-09-27 14:26 GMT
తెలంగాణ రాష్ట్రంలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు. బ్రేక్ ఫాస్ట్ కోసం విట్రీస్, హెచ్‌కెఎమ్ ఛారిటబుల్ ఫౌండేషన్ మధ్య ఒప్పందం కుదిరింది.
- శుక్రవారం అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంవోయూపై ఫౌండేషన్ సీఈవో కౌంతేయ దాస,అడ్మినిస్ట్రేటివ్ హెడ్ మిషెల్ డొమినికాలు సంతకాలు చేశారు.
విట్రీస్ ఔదార్యం
విట్రీస్ కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత కొడంగల్ నియోజకవర్గంలోని 312 పాఠశాలల్లోని 28,000 మంది విద్యార్థులకు అల్పాహారాన్ని అందించనున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్ బుల్ కార్యక్రమంలో భాగంగా రూ.6.4 కోట్ల విరాళాన్ని అందించిన విట్రీస్ సంస్థ అందించింది.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారాన్ని అందించారు. కానీ ఈ సారి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద వచ్చే నిధులతో పాఠశాల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా మొదటి సారి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ నుంచి విద్యార్థులకు అల్పాహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.